టాటా స్టీల్‌లో జాబ్స్.. ట్రైనింగ్‌లో రూ. 30 వేలు.. తర్వాత ఏడాదికి రూ. 7 లక్షల జీతం!

టాటా స్టీల్ లో ఉద్యోగం చేయాలనేది మీ కోరిక ఐతే మీ కోసమే ఈ సువర్ణావకాశం. శిక్షణ ఇచ్చి రూ. 30 వేలు ఉపకారవేతనం ఇవ్వడమే కాకుండా శిక్షణ పూర్తయ్యాక ఉద్యోగం ఇచ్చి రూ. 7 లక్షల జీతం ఇస్తారు.

  • Written By:
  • Publish Date - June 1, 2023 / 08:13 PM IST

దేశంలోనే అత్యంత ఉన్నత విలువలు కలిగిన సంస్థ టాటా గ్రూప్. ఈ సంస్థకు చెందిన టాటా స్టీల్ కంపెనీ బీ.ఈ./బీ.టెక్., బీ.ఎస్సీ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇంజనీర్ ట్రైనీలుగా అవకాశం ఇస్తోంది. ఆపరేషన్స్, మెయింటెనెన్స్, ఇంజనీరింగ్ అండ్ ప్రాజెక్ట్స్ ఏరియాల్లో పని చేసేందుకు ఇంజనీర్ ట్రైనీ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తయ్యాక టాటా స్టీల్ కంపెనీలో మూడేళ్ల పాటు ఫిక్స్డ్ అసిస్టెంట్ మేనేజర్ గా నియమిస్తారు. శిక్షణలో నెలకు రూ. 30 వేలు ఉపకారవేతనం చెల్లిస్తారు. శిక్షణ పూర్తయ్యాక జాబ్ లో చేరితే ఏడాదికి రూ. 7 లక్షల జీతం ఇస్తారు. అర్హతలు ఏంటి? ఎలా అప్లై చేసుకోవాలి? వయసు పరిమితి ఎంత అనే వివరాలు మీ కోసం.

పొజిషన్: ఇంజనీర్ ట్రైనీ

ప్రోగ్రాం వివరాలు:

  • ఎంపికైన అభ్యర్థులకు ఏడాది కాలం పాటు శిక్షణ ఉంటుంది.
  • శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులను టాటా స్టీల్ లో అసిస్టెంట్ మేనేజర్ గా మూడేళ్ళ పాటు పని చేసేలా నియమిస్తారు.

అర్హతలు:

  • సివిల్ & స్ట్రక్చరల్, సిరామిక్, కెమికల్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఇన్స్ట్రుమెంటేషన్/పవర్ ఎలక్ట్రానిక్స్, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్, మెకానికల్, మెటలర్జీ, మినరల్, మైనింగ్, బెనిఫిసియేషన్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెకట్రానిక్స్, జీఈఓ ఇన్ఫర్మేటిక్స్ శాఖల్లో బీ.ఈ./బీ.టెక్./బీ.ఎస్సీ. (ఇంజనీరింగ్) ఫైనల్ చదువుతున్న వారు అర్హులు.
  • లేదా జియాలజీ, జీఈఓ ఫిజిక్స్, రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ విభాగాల్లో ఎంటెక్/ఎం.ఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు అర్హులు.
  • మూడేళ్లు డిప్లొమా చదివి, ఇంజనీరింగ్ రెండవ సంవత్సరంలో చేరి నాల్గవ ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే.
  • ఏఐసీటీఈ/యూజీసీ ఆమోదించిన పూర్తి సమయం క్యాంపస్ ప్రోగ్రాంలో హాజరు కలిగి ఉండాలి.
  • జనరల్ అభ్యర్థులు బీఈ/బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ లో ఖచ్చితంగా సీజీపీఏ ప్యాటర్న్ ప్రకారం కనీసం 6.5 మార్కులు లేదా 65 శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
  • ట్రాన్స్ జెండర్లు, పీడబ్ల్యూడీ, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు బీఈ/బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ లో సీజీపీఏ ప్యాటర్న్ ప్రకారం కనీసం 6 మార్కులు ఉండాలి. లేదా 60 శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
  • ఝార్ఖండ్, ఒడిశాకు చెందిన స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

వయసు పరిమితి:

  • జనరల్ అభ్యర్థులకు: జూన్ 01 2023 నాటికి 30 ఏళ్లకు మించకూడదు.
  • ట్రాన్స్ జెండర్లు, పీడబ్ల్యూడీ, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు: జూన్ 01 2023 నాటికి 32 ఏళ్లు మించకూడదు.

పారితోషికాలు:

  • ఇంజనీర్ ట్రైనీకి ఏడాది పాటు శిక్షణ ఇచ్చి నెలకు రూ. 30 వేలు ఉపకారవేతనం చెల్లిస్తారు.
  • మెడి-క్లెయిమ్ పథకం కింద ఇంజనీర్ ట్రైనీకి ఏడాదికి రూ. 2,50,000 విలువైన హాస్పిటలైజేషన్ కవరేజ్ ఉంటుంది.
  • అలానే ఓపీడీ కవరేజ్ ఏడాదికి రూ. 6 వేలు ఉంటుంది.
  • శిక్షణ పూర్తయ్యాక ఏడాదికి రూ. 7 లక్షలు జీతం చెల్లిస్తారు.
  • అసిస్టెంట్ మేనేజర్ గా అపాయింట్ చేసుకున్నాక కంపెనీ పాలసీ ప్రకారం ఇతర ప్రోత్సాహకాలు, ప్రయోజనాలు ఉంటాయి.

ఎంపిక విధానం:

  • ఆన్ లైన్ కాగ్నిటివ్ మరియు టెక్నికల్ టెస్టులు నిర్వహిస్తారు.
  • టెస్టులో పాసైన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి డైరెక్ట్ ఇంటర్వ్యూ లేదా ఆన్ లైన్ లో ఇంటర్వ్యూ చేస్తారు.

దరఖాస్తు వివరాలు:

  • దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ లో
  • దరఖాస్తు చివరి తేదీ: 11/06/2023

 

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest jobsNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed