టాటా మెమోరియల్ సెంటర్ అనేది క్యాన్సర్ రోగుల పట్ల జాగ్రత్తలు తీసుకోవడం గానీ, క్యాన్సర్ ని నివారణ చర్యలు చేపట్టడం, ఆంకాలజీ మరియు అనుబంధ విభాగాల్లో.. క్యాన్సర్ రీసెర్చ్ మరియు ప్రొఫెషనల్ డెవలప్మెంట్ పనులు చేయడంలో అత్యంత శ్రద్ధ తీసుకునే లక్ష్యంతో సమగ్రంగా పని చేస్తున్న క్యాన్సర్ సెంటర్. టీఎంసీ అనేది భారత ప్రభుత్వానికి చెందిన అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ చేత నడపబడుతున్న సంస్థ. ఈ సంస్థలోని పలు పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ముంబై, వైజాగ్ సహా పలు నగరాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ, పురుషులు ఎవరైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చునని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. మరి పోస్టులు ఏంటి? కావలసిన అర్హతలు ఏమిటి? జీతం ఎంత? జబ లొకేషన్ ఎక్కడ? అనే వివరాలు మీ కోసం.