దేశంలో టాటా సంస్థలకున్న పేరు, విశ్వసనీయత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉప్పు మొదలు.. విమానయానం వరకు అన్ని రంగాల్లో విస్తరించింది. ఇక ఉద్యోగులను కూడా సొంత కుటుంబ సభ్యుల మాదిరి ఆదరిస్తారు. టాటా కంపెనీలో జాబ్ అంటే.. ఎంతో గొప్పగా భావిస్తారు. ఇక సాఫ్ట్‌వేర్ రంగంలో టాటా కంపెనీకి చాలా మంచి పేరు ఉంది. ఈ కంపెనీలో సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం యువత ఆసక్తిగా ఎదురు చూస్తు ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా టాటా సంస్థ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంస్థ చరిత్రలోనే ఇది భారీ నోటిఫికేషన్ అంటున్నారు ఐటీ నిపుణులు. ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ ఎగ్జామ్ (వర్బల్, అనలైటికల్, కోడింగ్ ఎంసీక్యూస్, కోడింగ్) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఉద్యోగం సాధించిన అభ్యర్థులు.. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పుణె, త్రివేండ్రం, కొజికోడ్ తదితర నగరాల్లో పని చేయాల్సి ఉంటుందని తెలిపారు.
పోస్టులు: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
జాబ్ లొకేషన్: హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పుణె, త్రివేండ్రం, కొజికోడ్ తదితర నగరాలు.
అర్హులు:
2022 బ్యాచ్ పాస్డ్ ఔట్ స్టూడెంట్స్ మాత్రమే.
పరీక్ష తేదీ గురించి కంపెనీ వారు మీ మెయిల్‌కి వివరాలు పంపిస్తారు. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే అప్లై చేయండి.