ప్రభుత్వ సంస్థల్లో కొలువు సాధించాలన్నది మీ కోరికా..! అయితే, అలాంటి సువర్ణావకాశం మీ ముందుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో దేశవ్యాప్తంగా నియామకాలు చేపట్టే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విదుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 12,523 ఖాళీలను భర్తీ చేయనుండగా, ఇందులో హవల్దార్, ప్యూన్, డ్రాఫ్టరీ, జమిందార్, జేటీవో, చౌకీదార్, సఫాయివాలా, మాలి వంటి పోస్టులు ఉన్నాయి. మొదట 11,409 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో ప్రకటించినప్పటికీ.. సవరణ అనంతరం 12,523 ఖాళీలు ఉన్నట్లు ఖరారు చేస్తూ సవరించిన పోస్టుల వివరాలను ఎస్‌ఎస్‌సీ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హతలో ఉత్తీర్ణులై ఉండాలి.
మొత్తం ఖాళీలు: 12,523
విద్యార్హతలు: పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హతలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: పోస్టులను అనుసరించి 01.01.2023 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వడ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్ (పీఎస్‌టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తు ఫీజు: ఓసీ/ బీసీ/ ఈడబ్ల్యూసీ అభ్యర్థులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు/ ఎస్‌సి/ ఎస్‌టి/ దివ్యాంగులు/ ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.