మీరు నిరుద్యోగులా..? అయితే ఈ సువర్ణావకాశం మీకోసమే. నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణతో పాటు ఉపాధి కల్పిస్తున్నారు. ఈ శిక్షణా సమయంలో అభ్యర్థులకు ఉచిత నివాస, భోజన వసతులు కల్పిస్తారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఉచితంగా ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్‌పూర్ గ్రామంలోని స్వామి రామానందతీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ దరఖాస్తులు కోరుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన’ కింద ఈ శిక్షణ కొనసాగనుంది. ఈ నైపుణ్య కోర్సులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉండి.. 8వ తరగతి, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ శిక్షణా సమయంలో అభ్యర్థులకు ఉచిత నివాస, భోజన వసతులు కల్పిస్తారు.
తెలంగాణ ప్రభుత్వ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకి చెందిన స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణతో పాటు ఉపాధి కల్పిస్తారు. అభ్యర్థులకు వివిధ కోర్సుల్లో నైపుణ్య శిక్షణ అందించిన అనంతరం వారికి సరైన ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు ప్రారంభ వేతనంగా రూ.6000 – రూ.8000 వరకు ఉంటుంది. ఆ తర్వాత 6 నెలల నుంచి ఏడాది కాలంలో నిబంధనల ప్రకారం వేతన పెంపు ఉంటుంది. ఈ శిక్షణ కోర్సుల్లో ప్రవేశాలు కోరేవారు ఒరిజినల్ సర్టిఫికేట్లతో ఏప్రిల్ 10న సంస్థలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
కంప్యూటర్ హార్డ్‌వేర్, సెల్‌ఫోన్/ ఎలక్ట్రానిక్ వస్తువు రిపేర్, సీసీ టీవీ టెక్నీషియన్
ఎలక్ట్రీషియన్(డొమెస్టిక్), సోలార్ సిస్టమ్ ఇన్‌స్టలేషన్/సర్వీస్
టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జర్దోజీ, బ్యాగ్స్ మేకింగ్
కావలసిన పత్రాలు:
హాజరు కావాల్సిన తేదీ: 10.04.2023 ఉదయం 10 గంటలు.
చిరునామా:
అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 9133908000, 9133908111, 913390822, 9949466111 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.