మీరు రైల్వే ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్. సౌత్‌ఈస్ట్ సెంట్రల్ రైల్వే(ఎస్‌ఈసీఆర్) పలు అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
నిరుద్యోగులకు సౌత్‌ఈస్ట్ సెంట్రల్ రైల్వే(ఎస్‌ఈసీఆర్) శుభవార్త చెప్పింది. సౌత్‌ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఆధ్వర్యంలోని పర్సనల్ డిపార్ట్‌మెంట్, డివిజనల్ రైల్వే మేనేజర్ పరిధిలో.. 548 ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కార్పెంటర్, ఫిట్టర్, పెయింటర్, ప్లంబర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, స్టెనో, డ్రాఫ్ట్స్‌మెన్, టర్నర్, వైర్‌మ్యాన్, గ్యాస్‌కట్టర్, ఫొటోగ్రాఫర్, వెల్డర్, షీట్ మెటల్ వర్కర్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు భర్తీ చేయనున్నారు. పదో తరగతి కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతో పాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ పూర్తిచేసిన వారు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 548 (ట్రేడ్ అప్రెంటిస్‌షిప్)
కేటగిరి వారీగా ఖాళీలు:
విభాగాలు: కార్పెంటర్, కోపా, ఫిట్టర్, పెయింటర్, ప్లంబర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, మెషినిస్ట్, టర్నర్, వైర్‌మ్యాన్, గ్యాస్‌కట్టర్, ఫొటోగ్రాఫర్, వెల్డర్, స్టెనో, షీట్ మెటల్ వర్కర్ మొదలైనవి.
అర్హతలు: పదో తరగతి కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతో పాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ పూర్తిచేసిన వారు అర్హులు.
వయోపరిమితి: 01.07.2023 నాటికి అభ్యర్థుల వయసు 15నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
అప్రెంటిస్‌షిప్ కాలవ్యవధి: 1 ఏడాది.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 03.05.2023.
దరఖాస్తులకు చివరి తేది: 03.06.2023.