ముంబై కేంద్రంగా ఉన్న సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ).. వివిధ విభాగాల్లో ఆఫీసర్ గ్రేడ్ ఏ(అసిస్టెంట్ మేనేజర్లు) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు ప్రక్రియ జూలై 14 నుండి ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 31లోపు దరఖాస్తు చేసుకోవాలి. మీరు అధికారిక సైట్ sebi.gov.in ను సందర్శించడం ద్వారా పూర్తి వివరాలతో పాటు.. దరఖాస్తును కూడా సమర్పించవచ్చు.
ముఖ్య సమాచారం:
ఖాళీ వివరాలు – 24:
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుండి కంప్యూటర్ అప్లికేషన్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హతతో, ఏదైనా విభాగంలో ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా ఏదైనా విభాగంలో ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ.
వయసు: 30.06.2022 నాటికి 30ఏళ్లు మించకుండా ఉండాలి.
దరఖాస్తు రుసుము:
వేతనం: గ్రేడ్ Aలోని అధికారుల పే స్కేల్ 44500-2500(4)-54500-2850(7)-74450-EB-2850(4)-85850- 3300(1)-89150 (17 సంవత్సరాలు).
ఎంపిక విధానం: మూడు దశల్లో జరుగుతుంది. మొదటిగా ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. దీనిలో రెండు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్ 100 మార్కులకు ఉంటుంది. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ఫేజ్ 1 స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఫేజ్ 2 ఆన్‌లైన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. ఫేజ్ 2 ఆన్‌లైన్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. దీనిలో ప్రతి పేపర్ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకి ఎంపికచేస్తారు. ఫేజ్ 2లో సాధించిన స్కోర్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలు, ఆన్ లైన్ లో అప్లై చేయడానికి ఈ లింక్ SEBI Recruitment క్లిక్ చేయండి.