ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో 1300 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఐటీఐ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం అభ్యర్థులు మొదట NAPS (National Apprenticeship Promotion Scheme) పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆపై సింగరేణి అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం ఖాళీలు: 1300(ట్రేడ్ అప్రెంటీస్)
ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, మెకానిక్ డీజిల్, మెకానిక్ మోటార్ వెహికిల్, టర్నర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్ మెన్.
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి.
స్టైపెండ్: రెండేళ్ల ఐటీఐఅభ్యర్థులకు నెలకు రూ.5050, ఏడాది ఐటీఐ అభ్యర్థులకు రూ.7300 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆన్ రోల్ ఉద్యోగులకు మొదటి ప్రాధాన్యతనిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 06.08.2022,
ఆ 4 జిల్లాల వారికి 95 శాతం రిజర్వేషన్:
కోల్‌బెల్ట్ పరిధిలోకి వచ్చే ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్‌లో 95 శాతం రిజర్వేషన్ ఉంటుంది. నాన్ లోకల్ వారికి 5 శాతం ఉంటుంది. లోకల్ అభ్యర్థుల్లో సింగరేణి కుటుంబాలకు చెందినవారికి, డిపెండెంట్ జాబ్స్‌కి అర్హులైన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
లోకల్: పాత నాలుగు జిల్లాలకు చెందిన అభ్యర్థులు అంటే ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ (ఇప్పుడు 16 జిల్లాలు) స్థానిక కేటగిరీ కిందకు వస్తారు.
నాన్ లోకల్: తెలంగాణ రాష్ట్రంలోని ఈ 16 జిల్లాలు కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు నాన్ లోకల్ కిందకు వస్తారు.