మీరు ఐటిఐ పూర్తి చేశారా..? కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారా..? అయితే ఈ సువర్ణావకాశం మీకోసమే. ప్రభుత్వ రంగ ఉక్కు సంస్థ 'సెయిల్' పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న ప్రభుత్వ రంగ ఉక్కు సంస్థ ‘స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్)’ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 239 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలలో ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, రిగ్గర్, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్, కంప్యూటర్/ఐసీటీఎస్ఎం, ఆర్ఈఎఫ్ అండ్ ఏసీ, మెకానిక్ మోటార్ వెహికల్, ప్లంబర్, డ్రాఫ్ట్స్ మ్యాన్ (సివిల్) పోస్టులు ఉన్నాయి. ఇస్కో స్టీల్ ప్లాంట్ బర్నపూర్‌లో ఈ ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణుత సాధించి ఉండాలి. మరిన్ని వివరాలు..
మొత్తం ఖాళీలు: 239 (ట్రేడ్ అప్రెంటిస్)
విభాగాలు:
అర్హతలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.04.2023 నాటికి అభ్యర్థులు వయసు 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్(నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ (NAPS) పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది).
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం: అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
స్టైపండ్: ఎంపికైన వారికి నెలకు రూ. 7000 నుంచి రూ. 7,700 వరకు స్టైపెండ్ రూపంలో చెల్లిస్తారు.
దరఖాస్తులకు చివరితేది: 29.04.2023