డిగ్రీ పాసై సరైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ జాబ్ మీ కోసమే ఉన్నట్టుంది. నిజానికి ఇవాల్టితోనే దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. మీ అదృష్టం బాగుండి దరఖాస్తు గడువు పెంచారు. మరింకెందుకు ఆలస్యం వెంటనే దరఖాస్తు చేసుకుని బాగా ప్రిపేర్ అయిపోండి. నెలకు 36 వేలు నుంచి 60 వేలకు పైనే జీతం ఇస్తారు. కానీ దరఖాస్తు చేసే ముందు ఆర్టికల్ పూర్తిగా చదవండి.
డిగ్రీ పాసయ్యారా? సరైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? బ్యాంకులో మంచి పొజిషన్ ఉన్న ఉద్యోగం దొరికితే బాగుండు అని భావిస్తున్నారా? అయితే ఈ ఉద్యోగం మీ కోసమే. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) భారీగా ఉద్యోగాలను ప్రకటించింది. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి 17 నుంచి 28 వరకూ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. నిజానికి ఈ దరఖాస్తు గడువు ఈరోజున అంటే ఫిబ్రవరి 28తో ముగియాల్సింది. కానీ గడువు తేదీని ఐడీబీఐ బ్యాంకు మార్చింది. తాజా ప్రకటనలో గడువు తేదీని మార్చి 12 వరకూ పొడిగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మరింకెందుకు ఆలస్యం.. ఇంకా దరఖాస్తు చేసుకోని వారు ఎవరైనా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హతలు, జీతం, పరీక్ష తేదీ ఎప్పుడు? వంటి వివరాలు మీ కోసం.