బ్యాంక్ ఉద్యోగం సాధించడం వేరు. బ్యాంకులన్నిటికీ బాస్ అయిన ఆర్‌బీఐలో ఉద్యోగం సాధించడం వేరు. ఒక్కసారి ఈ జాబ్ కొట్టారంటే జీవితంలో స్థిరపడినట్టే. నెలనెలా వేలకు వేలకు జీతం అందడమే కాదు, లెక్కలేనన్నీ సెలవులు, ఆ మజానే వేరనుకోండి. అలాంటి సువర్ణావకాశం మీ ముందుకొచ్చింది.
నిరుద్యోగులకు రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. 291 గ్రేడ్ బీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్)జనరల్, డీఈపీఆర్, డీఎస్‌ఐఎం పోస్టులు భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు: 291
విభాగాలు:
విద్యార్హతలు: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష(ఫేజ్ 1, 2), ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యూమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
జీతభత్యాలు: ఆర్‌బీఐ గ్రేడ్ బీ ఆఫీసర్ పోస్ట్ బేసిక్ పే రూ. 55,200 నుంచి ప్రారంభమవుతుంది.
దరఖాస్తు చేయు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 850; ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు రూ. 100 దరఖాస్తు రుసుముగా చెల్లించాలి.
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 09.05.2023
దరఖాస్తులకు చివరితేదీ: 09.06.2023
రాత పరీక్ష తేదీలు: