ప్రభుత్వ ఉద్యోగం చేయాలని చాలా మందికి కోరిక ఉంటుంది. తమ ఆశలను నిరవేర్చుకునేందుకు ఎంతో కృషి చేస్తుంటారు. ఇలాంటి సమయంలో పదోతరగతి పాసైన నిరుద్యోగలకు తపాలశాఖ శుభవార్త తెలిపింది. పోస్టల్ శాఖలో ఉన్న ఖాళీలతో భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో 40 వేలకు పైగా గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది. దీనికి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం పదో తరగతి లో సాధించిన మార్కుల ఆధారంగానే ఎంపిక జరుగుతుంది. మరి.. ఈ 40 వేల పోస్టులో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయి, అలానే నోటిఫీకేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
కేంద్ర ప్రభుత్వ సంస్థలో అతి ప్రధానమైన వాటిల్లో తపాల శాఖ ఒకటి. ఒకప్పుడు కేవలం సమాచారం మాత్రమే చేరవేసే ఈ శాఖ.. నేడు అనేక సేవలను అందిస్తుంది. బ్యాంకులు పోటీగా వివిధ రకాల పథకాలను వినియోదారులకు అందిస్తుంది. తమ సేవలను మరింత మెరుగుపరుచుకునే క్రమంలో ఎప్పటికప్పుడు ఉద్యోగ నియమాకాలను చేపడుతుంది. తాజాగా తపాల శాఖా భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ పోస్టాఫీసుల్లో 40,889 జీడీఎస్ పోస్టులకు ప్రకటన వెలువడింది. ఈ ఉద్యోగాలకు పదో తరగతి ఉత్తీర్ణలైన వారు అర్హుతులు. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు ఆయ బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
ఇక ఎంపికైనా వారికి పోస్టును బట్టి జీతం ఉంటుంది. రూ.10,000 – రూ.12,000 ప్రారంభ వేతనం అందుకోవచ్చు. అర్హత కలిగి, ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 16 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇక ఈ పోస్టులో ఏపీ లో 2480, తెలంగాణలో 1266 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సెలక్ట్ అయిన వారు రోజుకు నాలుగు గంటలు మాత్రమే పనిచేస్తే సరిరపోతుంది. అదనంగా ఇండియన్ పోస్టల పేమెంట్ బ్యాంకుకు పనులకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ ఉంటాయి. వారు అందిచే సేవల ఆధారంగా ఇంటెన్సివ్ ఉంటుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి డిజిటల్ సామాగ్రి తపాలా శాఖ అందిస్తుంది. అయితే ఈ పోస్టులకు ఎంపికైన వారి నివాసం పోస్టాఫీసుకు అందుబాటులో ఉండాలి. ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆంధ్రప్రదేశ్- 2480, తెలంగాణ- 1266,అసోం- 407, బిహార్- 1461, ఛత్తీస్‌గఢ్-1593, దిల్లీ – 46, గుజరాత్- 2017, హరియాణా- 354, హిమాచల్‌ప్రదేశ్- 603, జమ్ము కశ్మీర్- 300, ఝార్ఖండ్- 1590, కర్ణాటక- 3036, కేరళ- 2462, మధ్యప్రదేశ్- 1841, మహారాష్ట్ర- 2508, నార్త్ ఈస్టర్న్- 923, ఒడిశా- 1382, పంజాబ్- 766, రాజస్థాన్- 1684, తమిళనాడు- 3167, ఉత్తర ప్రదేశ్- 7987, ఉత్తరాఖండ్- 889, పశ్చిమ బెంగాల్- 2127.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతిలో తప్పని సరిగా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇందులోనూ మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష తప్పనిసరి ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంగ్లీష్ తో పాటు తెలుగును పదో తరగతి వరకు ఓ సబ్జెక్టు గా ఉండాలి. కంప్యూటర్ అవగాహనతో పాటు సైకిల్ తొక్కటం వచ్చి ఉండాలి.
పదో తరగతిలో సాధించిన మార్కులు ఆధారంగా ఈ నియామకాలు చేపడతారు. నోటిఫికేషన్ లో ఇచ్చిన ఖాళీల వివరాలను అభ్యర్థులు పరిశీలించి, తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోవాలి. అలా ప్రాధాన్యత ప్రకారం.. ఆప్షన్లు ఇస్తూ దరఖాసు నింపాలి. మార్కుల ఆధారంగా అవకాశాన్ని బట్టి వీటిలో ఏదో బ్రాంచ్ లో పోస్టింగ్ కేటాయిస్తారు. పోస్టుకు ఎంపికైన వారికి ఎస్ఎంఎస్/ ఈమెయిల్/ పోస్టు ద్వారా సమాచారం అందుతుంది.
ఇక జీతాల విషయానికి వస్తే పోస్టులను పట్టి ప్రారంభం రూ. 10 వేల నుంచి రూ. 12 వేలు ఉంటుంది. నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 – రూ.29,380, ఏబీపీఎ లేదా డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 – రూ.24,470 వేతనం ఉంటుంది.
ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభం: 27.01.2023
ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేది: 16.02.2023
దరఖాస్తుల సవరణలకు: 17. 02.2023 నుంచి 19.02.2023 వరకు ఉంటుంది.
ఇక విధుల విషయానికి వస్తే.. బ్రాంచ్ పోస్టు మాస్టర్ పోస్టుకు సెలక్ట్ అయిన వారు.. తన పరిధిలోని బ్రాంచ్ కార్యకలాపాలు పర్యవేక్షించాలి. పోస్టల్ విధులతో పాటు ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంకు వ్యవహారాలూ చూసుకోవాలి. ఇక అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ విషయానికి వస్తే.. ఈ ఉద్యోగంలో చేరిన వాళ్లు స్టాంపులు, స్టేషనరీ అమ్మకం, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూడటం,బ్రాంచ్ పోస్టు మాస్టర్ నిర్దేశించిన పనులు పూర్తి చేయాలి. డాక్ సేవక్.. ఈ విధుల్లో చేరినవారు ఉత్తరాలు పంపిణీ చేయాలి. అలాగే స్టాంపులు, స్టేషనరీ అమ్మకాలు చేయాలి. బీపీఎం, ఏబీపీఎం సూచించిన పనులు పూర్తి చేయాలి. మరి.. తాజాగా తపాల శాఖ విడుదల చేసిన ఈ భారీ నోటిఫికేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.