'ఏం చదివావ్.. ? బీటెక్ సార్.. అయితే జాబుల్లేవ్' ప్రస్తుతం బీటెక్ గ్రాడ్యుయేట్ల పరిస్థితి ఇలానే ఉంది. నాలుగేళ్ల పాటు ఎంతో శ్రమించి డిగ్రీ పూర్తి చేస్తే సరైన అవకాశాలు ఉండట్లేదు కాదు కదా! బీటెక్ క్వాలిఫికేషన్ అంటేనే చులకనగా చూస్తున్నారు. ఇలాంటి సమయంలో బీటెక్ పూర్తయిన వారికి ఓ ప్రభుత్వ సంస్థ శుభవార్త చెప్పింది.
మీరు బీటెక్ పూర్తి చేశారా..? అయితే ఈ అవకాశాన్ని అసలు మిస్ చేసుకోకండి. ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌టీపీసీ లిమిటెడ్ శాశ్వత ప్రాతిపదికన వివిధ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 66 ఖాళీలను భర్తీ చేయనున్నారు. బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 21 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేనుకోవచ్చు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? జీతభత్యాలు ఎలా ఉంటాయి..? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం ఖాళీలు: 66
విభాగాలు:
అర్హతలు: ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/ మెకానికల్/ ప్రొడక్షన్/ సివిల్/ కన్స్ట్రక్షన్ విభాగాల్లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులైన వారు అర్హులు. అలాగే పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.
జీత భత్యాలు: రూ.60,000 నుంచి రూ.1,80,000 వరకు వేతనంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి. ఎస్‌సీ/ ఎస్‌టీ/ దివ్యాంగులు/ ఎక్స్-సర్వీస్‌మెన్/ మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 07.04.2023
దరఖాస్తులకు చివరి తేదీ: 21.04.2023