బీఈ, బీటెక్ వంటి పైచదువులు చదివిన వారికి గుడ్ న్యూస్ అందుతోంది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్‌టీపీసీ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.55వేల వేతనం పొందవచ్చు. దీనికి అలవెన్సులు అదనం.
భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ యాజమాన్యంలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్‌టీపీసీ) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 120 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, ఏసీఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్), అసిస్టెంట్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) ఖాళీలున్నాయి. ఎలక్ట్రికల్/ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో బీఈ, బీటెక్ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అర్హత, ఆసక్తిగల వెంటనే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి మరిన్ని వివరాలు ఇపుడు తెలుసుకుందాం..
మొత్తం ఖాళీలు: 120
అర్హతలు: ఎలక్ట్రికల్/ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో బీఈ, బీటెక్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పని అనుభవం కూడా ఉండాలి. అసిస్టెంట్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) ఖాళీలకు గేట్-2022 స్కోర్ తప్పనిసరి.
వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు. ఓబిసిలకు మూడేళ్లు, ఎస్‌సీ, ఎస్‌టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంది.
జీతభత్యాలు: ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.55,000 వేతనం చెల్లిస్తారు. దీనికి అలవెన్సులు అదనం.
ఎంపిక ప్రక్రియ: అప్లికేషన్ స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, సెలెక్షన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూసీ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 09.05.2023
దరఖాస్తులకు చివరి తేదీ: 23.05.2023