ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ వంటి చదువులు చదివిన వారికి కేంద్ర ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన నవరత్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ లోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్(ఎన్ఎల్సీ) ఇండియా లిమిటెడ్ గుడ్ న్యూస్ చెప్పింది.పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మీరు ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ వంటి చదువులు చదివారా..? ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం మీ కోసమే. బొగ్గు మంత్రిత్వ శాఖ కింద పని చేసే నవరత్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ లోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్(ఎన్ఎల్సీ) ఇండియా లిమిటెడ్ కంపెనీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. చెన్నై హెడ్ క్వార్టర్స్ గా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్, ఐటీఐ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయుటకు నోటిషికేషన్ విడుదలైంది. 2021, 22, 23 సంవత్సరాల్లో ఐటీఐ, డిగ్రీ, డిప్లోమా, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు వీటికి అర్హులు. ఏయే ఖాళీలు ఉన్నాయి. ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వంటి వివరాలు మీ కోసం.
విభాగాలు:
1). గ్రాడ్యుయేట్/డిగ్రీ (ఇంజనీరింగ్ & నాన్ ఇంజనీరింగ్) అప్రెంటిస్ ఖాళీలు: 35
2). టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ ఖాళీలు: 42
3). ఐటీఐ అప్రెంటిస్ ఖాళీలు: 86
ట్రైనింగ్ పీరియడ్: ఒక సంవత్సరం
జీతభత్యాలు: ఇంజనీరింగ్ & నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ ఫైనాన్స్, హెచ్ఆర్ అభ్యర్థులకు: నెలకు రూ. 12,524, కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, మైనింగ్, ఫైర్ & సేఫ్టీ ఇంజనీర్లకు నెలకు రూ. 15,028, టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్‌లకు: నెలకు రూ. 12,524, ఐటీఐ అప్రెంటిస్‌లకు నెలకు రూ. 10,019 స్టైపండ్ రూపంలో చెల్లిస్తారు.
వయోపరిమితి: ఐటీఐ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్తులకు: 14 ఏళ్ళు మించకూడదు.
ఇతర అర్హతలు:
దరఖాస్తు విధానం: ఆన్ లైన్.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 30