నిరుద్యోగులకు హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్(NIMS) శుభవార్త చెప్పింది. వారి వద్ద పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఔత్సాహికులు అక్టోబరు 12లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచింది. అయితే ఇవి పర్మినెంట్ ఉద్యోగాలు కావు. ఒక సంవత్సరం కాంట్రాక్టుతో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ, ఆకర్షణీయ జీతం ఉండటంతో నిరుద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. అర్హత, ఆసక్తిగల వ్యక్తులు ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులలో 12వ తరగతి క్వాలిఫికేషన్‌తోనూ అవకాశాలు ఉన్నాయి. నిమ్స్ వాళ్లు ఇచ్చిన ఈ కాంట్రాక్ట్ భర్తీ నోటిఫికేషన్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్, లేబొరేటరీ టెక్నీషియన్, రీసెర్చ్ అసిస్టెంట్, సైంటిస్ట్ వంటి పోస్టుల భర్తీ చేయనున్నారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్:
డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా చేయాలి అనుకునే వారు 12వ తరగతి లేదా ఇంటర్‌లో సైన్స్ సబ్జెక్టుల్లో పాసై ఉండాలి. వారి వయసు 28 ఏళ్లలోపు వారై ఉండాలి. కంప్యూటర్ టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. అందులోనూ గంటకు 15 వేల క్యారెక్టర్స్ కు తగ్గకుండా టైపింగ్ చేయగలగాలి. అంతేకాకుండా హెల్త్ కేర్ డేటా ఎంట్రీలో కనీసం రెండేళ్ల అనుభవం ఉన్న వారికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈ డేటా ఎంట్రీ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ.18 వేలు వేతనం లభిస్తుంది. ఈ నోటిఫికేషన్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు కేవలం ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంది.
లేబరేటరీ టెక్నీషియన్:
30 ఏళ్ల వయసులోపు వారే ఈ పోస్టుకు అప్లై చేసేందుకు అర్హులు. అంతేకాకుండా దరఖాస్తు చేయాలనుకున్న వాళ్లు ఇంటర్ లేదా 12వ తరగతిలో సైన్స్ సబ్జెక్ట్స్ పాసై ఉండాలి. మెడికల్ లేబరేటరీ టెక్నాలజీలో రెండేళ్లు డిప్లామా చేసుండాలి. ఈ పోస్టుకు ఎంపికైన వారికి సంవత్సరం పాటు నెలకు రూ.18 వేలు జీతంగా అందజేస్తారు. గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుండి క్లినికల్ మైక్రోబయాలజీ లేబరేటరీ వర్క్ కు సంబంధించి ఎక్స్ పీరియన్స్ కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్‌లో లేబరేటరీ టెక్నీషియన్స్ ఇద్దరు కావాలని వెల్లడించారు.
రీసెర్చ్ అసిస్టెంట్:
రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుకు అప్లై చేసేందుకు 30 ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలి. లైఫ్ సైన్సెస్ లో ఎమ్మెస్సీ పూర్తి చేసుండాలి. గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి మెడికల్ ఫీల్డ్ రీసెర్చ్‌లో ఎక్స్ పీరియన్స్ ఉన్నట్లు ధ్రువీకరణ కలిగి ఉండాలి. రీసెర్చ్ అసిస్టెంట్‌కు ఏడాది పాటు నెలకు రూ.31 వేలు వేతనంగా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్‌లో రీసెర్చ్ అసిస్టెంట్‌కు 1 పోస్టుకు ఖాళీ ఉన్నట్లు తెలిపారు.
సైంటిస్ట్:
ఈ నోటిఫికేషన్‌లో ఒక సైంటిస్ట్ పోస్టుకు కూడా ఖాళీ ఉన్నట్లు తెలిపారు. ఈ పోస్టు కోసం అప్లై చేసేవారు 35 ఏళ్లలోపు వారై ఉండాలి. మైక్రోబయాలజీ లేదా మోలేక్యూలర్ బయాలజీలో పోస్టు గ్రాడ్యూయేట్ అయ్యుండాలి. మోలేక్యూలర్ బయాలజీలో రెండేళ్ల అనుభవం ఉండి ఉండాలి. ఎంపికైన వారికి ఏడాదిపాటు నెలకు రూ.54,300 వేతనంగా చెల్లిస్తామని తెలిపారు. ఒక పోస్టుకు ఖాళీ ఉన్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం https://nims.edu.in/indexని ఒకసారి పరిశీలించండి. ఏడాది పాటు మాత్రమే ఉండే పోస్టులు అయినప్పటికీ నిమ్స్ లో చేసిన అనుభవం వారి కెరీర్‌ను మరింత బలోపేతం చేసుకునేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు.