నిరుద్యోగులకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇలాంటి ఉద్యోగాలకు పరిమిత సంఖ్యలో దరఖాస్తు చేస్తారు కనుక ఉద్యోగం సాధించేందుకు నిరుద్యోగులకు ఇదొక మంచి అవకాశమని చెప్పాలి.
కేంద్ర ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 347 నాన్ అకడమిక్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో సూపరింటెండింగ్ ఇంజినీర్, ప్రొడక్షన్ ఆఫీసర్, ఎడిటర్, బిజినెస్ మేనేజర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బిజినెస్ మేనేజర్, టెక్నికల్ ఆఫీసర్, ప్రొడక్షన్ మేనేజర్, సౌండ్ రికార్డిస్ట్ గ్రేడ్-I, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వంటి 65 రకాల ఖాళీలున్నాయి. అర్హత, ఆసక్తి గలవారు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్య వివరాలు:
మొత్తం ఖాళీలు: 347
కేటగిరి వారీగా ఖాళీలు:
విభాగాల వారీగా ఖాళీలు: సూపరింటెండింగ్ ఇంజినీర్, ప్రొడక్షన్ ఆఫీసర్, ఎడిటర్, బిజినెస్ మేనేజర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బిజినెస్ మేనేజర్, టెక్నికల్ ఆఫీసర్, ప్రొడక్షన్ మేనేజర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్.. ఇలా మొత్తం 65 రకాల ఖాళీలున్నాయి.
విద్యార్హతలు: పోస్టులను అనుసరించి పదో తరగతి/ ఇంటర్/ ఐటీఐ/ బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ డిప్లొమా/ బీటెక్/ బీఈ/ ఎంటెక్/ మాస్టర్స్ డిగ్రీ/ పీజీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైన వారు అర్హులు. అలాగే సంబంధిత పనిలో అనుభవంతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయో పరిమితి: 22.04.2023 నాటికి అభ్యర్థుల వయస్సు 27 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తు ఫీజు: సంబంధిత పోస్టులను అనుసరించి అన్‌రిజర్వడ్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1,000, రూ.1,200, రూ.1,500 చెల్లించాలి. ఎస్‌సీ/ఎస్‌టీ /పీడబ్ల్యూబీఈ/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తులు ప్రారంభ తేది: 29.04.2023.
దరఖాస్తులకు చివరి తేది: 19.05.2023.