స్కూల్ ఎడ్యుకేషన్ లో పాఠ్య ప్రణాళిక మరియు బోధనలకు సంబంధించి పాఠశాల ఎడ్యుకేషనల్ రీసెర్చ్, టీచర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ లో శిఖరం లాంటి సంస్థ అయిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT).. పలు పోస్టుల భర్తీ కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. న్యూఢిల్లీ కేంద్రంగా పని చేసే ఎన్సెర్ట్ లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద పలు విభాగాల్లో 292 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఢిల్లీ సహా పలు ఎన్సెర్ట్ సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి? వీటికి కావాల్సిన అర్హతలు ఏమిటి? జీతం ఎంత? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.