ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. ముంబై మెట్రో రైల్ లోని పలు సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందు కోసం ఆసక్తి గల అభ్యర్దులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. అయితే ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఎంపికైన వారికి నెల రూ.లక్ష వరకు జీతం పొందచ్చని సంస్థ ప్రకటనలో తెలిపింది. అసలు ఇందులో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? దరఖాస్తు ఎలా చేసుకోవాలనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నోటీఫికేషన్ లో భాగంగా అసిస్టెంట్ మేనేజర్, టౌన్ ప్లానర్, జనరల్ మేనేజర్, డిప్యూటీ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయని తెలిపింది. ఇక ఇవే కాకుండా అకౌంట్స్, రోలింగ్ స్టాక్, మెటీరియల్ మేనేజ్ మెంట్, పీఎస్ టీ వంటి విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటనలో తెలిపింది. ఇక ఖాళీల విషయానికొస్తే.. మొత్తం 18 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వివరించింది. పైన తెలిపిన ఉద్యోగాలకు అప్లయ్ చేసుకునే వారు 18 ఏళ్లు నిండి ఉండి డిగ్రీ, డిప్లొమా, ఎంబీసీ, పీజీ, సీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలని సంస్థ తెలిపింది. ఇక దరఖాస్తు విధానం ఆన్ లైన్ ద్వారానే ఉంటుందని, అభ్యర్ధులను పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా చేస్తారని సంస్థ తెలిపింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు దాదాపుగా రూ.లక్ష వరకు జీతం వస్తుందని ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది. దరఖాస్తుకు చివరి తేదీ 18-01-2023 గా నిర్ణయించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు వినియోగించుకోవాలని కార్యాలయ వర్గాలు సూచించాయి.