మీరు నిరుద్యోగులా..? అయితే మీకో గుడ్ న్యూస్. హైదరాబాద్ మహానగరంలో భారీ జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఏకంగా 100 కంపెనీలు ఈ జాబ్‌మేళాలో పాలు పంచుకోనుండగా, 10వేలకు పైగా ఉద్యోగాలు కల్పించనున్నారు. దివ్యాంగులకు సైతం ఈ జాబ్‌మేళాలో పాలు పంచుకోవచ్చు. నిరుద్యోగ యువతకు ఇదొక చక్కని అవకామని చెప్పాలి.
నగర నిరుద్యోగ యువతకు శుభవార్త. హైదరాబాద్‌లో భారీ జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఏకంగా 100 కంపెనీలు ఈ జాబ్‌మేళాలో పాల్గొననుండగా, 10వేలకు పైగా ఉద్యోగాలు కల్పించనున్నారు. ఏప్రిల్ 2వ తేదీన ఈ భారీ జాబ్ మేళా జరగనుంది. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో ఈ భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీ/ఎం ఫార్మసీ, బీటెక్, ఎంటెక్, బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంసీఎస్ విద్యార్హత కలిగిన వారు, డ్రైవర్లు ఈ జాబ్‌మేళాకు హాజరుకావచ్చు. నిరుద్యోగ యువత ప్రతి ఒక్కరూ తప్పకుండా హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
ఇంటర్వ్యూలు జరుగు తేదీ: ఏప్రిల్ 2, 2023
(ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.00 వరకు..)
ఇంటర్వ్యూలు జరుగు స్థలం: మెట్రో ట్రక్ పార్క్, వై-జంక్షన్, కూకట్ పల్లి, హైదరాబాద్.
హెల్ప్ లైన్ నంబర్స్: 630 1717 425, 630 1716 125.
రిజిస్ట్రేషన్ చేయు విధానం: అభ్యర్థులు కింద అటాచ్ చేసిన ఫొటో లోని క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
Job Mela at metro Truck park @kukatpally on 02-April-2023 by @mkrkkpmla @BRSparty @KTRBRS @SATISHCORP_FNG #jobmela #kukatpally #JobSeekers #Jobs #balanagar pic.twitter.com/pN2IoFyk7E
— Nani Yadav 𝐓𝐑𝐒 (@Naniyadav_8495) March 20, 2023