ఇంటర్ చదివి ఖాళీగా ఉన్నారా? ఇంటర్వ్యూ అంటే భయపడుతున్నారా? అయితే ఇంటర్వ్యూ ఫేస్ చేసే పని లేకుండా ఉద్యోగం పొందే సువర్ణావకాశం మీ కోసం. ఫ్రెషర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కి సమానంగా జీతం తీసుకునే ఉద్యోగం మీ కోసం. భారత ప్రభుత్వానికి చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ సంస్థ.. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తులను సబ్మిట్ చేయాలని నోటిఫికేషన్ లో పేర్కొంది. భారతీయ పౌరులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఏవేం పోస్టులు ఉన్నాయి? వాటికి ఉండాల్సిన అర్హతలు ఏమిటి? జీతం ఎంత ఇస్తారు? ఈ పోస్టుకి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? చివరి తేదీ ఎప్పుడు? వంటి వివరాలు మీ కోసం.