దేశీయ ప్రభుత్వ రంగ భీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ) దేశవ్యాప్తంగా ఎల్ఐసీ కార్యాలయాల్లో ఉన్న అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(ఏడీఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 9,394 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఇందులో హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య జోనల్ కార్యాలయం పరిధిలోని వివిధ డివిజనల్ కార్యాలయాల్లో 1408 ఖాళీలున్నాయి. ఏదేని విభాగంలో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులతో పాటు ఎల్‌ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలి..? జీతభత్యాలు ఎలా ఉంటాయి. ఎంపిక విధానం.. వంటి మరిన్ని వివరాలు మీకోసం..
జోన్ల వారీగా ఖాళీల వివరాలు…
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సౌత్ సెంట్రల్ జోనల్ లో ఖాళీలు: 1408.
అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా లైఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ/ ఫైనాన్స్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ విభాగంలో కనీసం రెండేళ్లు పని అనుభవం ఉన్నవారు అర్హులు.
వయోపరిమితి: 01.01.2023 నాటికి అభ్యర్థి వయస్సు 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు: ఏడీఓగా ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్ సమయంలో నెలకు రూ.51,500 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. అనంతరం ప్రొబేషనరీ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా నెలకు రూ.35650-రూ.90205 వేతనం ఉంటుంది. దీనికి ఇతర అలవెన్సులు అదనం.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్షలు (ప్రిలిమినరీ(100 మార్కులు)/ మెయిన్స్(160 మార్కులు)), ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు చేయు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తు ఫీజు: రూ.750.(ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.100)