దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ తరగతుల్లో ప్రవేశాలకు ప్రకటన జారీ చేశారు. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది.
విద్యార్థుల భవిష్యత్తుకు పునాదిగా భావించే పాఠశాల విద్య ఎంతో సృజనాత్మకతను, సహజ ఆసక్తులను కలిగించేలా ఉండాలి. అలా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌కు ప్రాధాన్యం ఇస్తూ.. మానసిక పరిణితికి దోహదం చేస్తున్న విద్యాసంస్థలే.. కేంద్రీయ విద్యాలయాలు! ఒక్కసారి కేవీల్లో ప్రవేశం లభించిందంటే.. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ స్థాయి వరకు ఒకేచోట విధ్యాబ్యాసం పూర్తవుతుంది. ఇలా పిల్లల చదువు ఒక్కచోటే పూర్తయితే విద్యార్థుల తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం మరోకటి ఉండదు. ఈ కేవీల్లో 2023–24 సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొదట ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 27 నుంచి ప్రారంభంకానుంది. మార్చి 27న ఉదయం 10 గంటలకు మొదలయ్యే ఈ ప్రక్రియ ఏప్రిల్ 17వ తేదీ రాత్రి 7 గంటల వరకు కొనసాగనుంది. ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందాలనుకునే చిన్నారుల వయసు మార్చి 31, 2023 నాటికి ఆరేళ్లు నిండి ఉండాలి. ఇక రెండో తరగతతితో పాటు, పై తరగతుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 3న ప్రారంభమై ఏప్రిల్ 12న ముగియనుంది. మిగతా తరగతులకు కూడా నిబంధనల మేరకు వయోపరిమితి వర్తిస్తుంది.
తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు మాత్రం అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తారు. 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో సబ్జెక్టు నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 3 గంటలు. ఒకటో తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా, ఇతర పైతరగతులకు ఆఫ్‌లైన్ విధానంలో ప్రవేశాలు కల్పిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారు బర్త్ సర్టిఫికేట్‌తో పాటు సంబంధిత సర్టిఫికెట్స్ సమర్పించాల్సి ఉంటుంది.
ఎంపిక జాబితా వెల్లడి: 20.03.2023 (లిస్ట్-1), 28.03.2023 (లిస్ట్-2), 04.05.2023 (లిస్ట్-3).
ఎంపిక జాబితా వెల్లడి: 17.04.2023.