భారత ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వశాఖకు చెందిన జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ (జిప్‌మర్) నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 433 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో 80 శాతం ఉద్యోగాలు మహిళలకు, మిగిలిన పోస్టులను ఇతర అభ్యర్ధులకు కేటాయిస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు పుదుచ్చేరిలోని జిప్‌మర్ సంస్థలో పనిచేయాల్సి ఉంటుంది.
విభాగాలు: నర్సింగ్ ఆఫీసర్
మొత్తం ఖాళీలు: 433
అర్హతలు: బీఎస్సీ నర్సింగ్/ బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్ లేదా బీఎస్సీ(పోస్ట్- సర్టిఫికేట్)/ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లేదా డిప్లమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీతో పాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.12.2022 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు రూ.44,900.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.1,500; ఎస్సీ, ఎస్టీలకు రూ.1,200; దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 07.11.2022.
దరఖాస్తులకు చివరి తేదీ: 01.12.2022.
హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవాల్సిన తేదీ: 10.12.2022
ఆన్ లైన్ పరీక్ష తేదీ: 18.12.2022