చాలా మంది యువత ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. ఈ క్రమంలో రేయింబవళ్లు కష్టపడి పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నోటిఫికేషన్ ఎప్పుడూ వస్తుందా.. అని నిరుద్యోగులు ఎదురు చూస్తుంటారు. అలాంటి వారి కోసం ప్రభుత్వ రంగ సంస్థ అయినా ఎల్ఐసీ ఓ శుభవార్త చెప్పింది. లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలోని 100 ఇన్సూరెన్స్ అడ్వైజర్ పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదలచేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే పోస్టుల వారీగా విద్యా అర్హతులు కలిగి ఉండాలి. ఇక ఎల్ఐసీ విడుదల చేసిన ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
భారత ప్రభుత్వరంగానికి చెందిన ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ. ఈ సంస్థ గురించి ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనేక రకాలైనా ఇన్సురెన్స్ పాలసీలు అందిస్తూ వినియోదారులను పెంచుకుంటుంది. అలానే ఎప్పటికప్పడు సంస్థలో అనేక మార్పులు తీసుకొస్తుంది. అయితే తాజాగా ఎల్ఐసీ సంస్థ 100 ఇన్సూరెన్స్ అడ్వైజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల ఏదైన గుర్తింపు పొందిన కళాశాల లేదా విద్యాసంస్థ లేదా విశ్వవిద్యాలయం నుంచి పదో తరగతి, ఇంటర్మీడియట్,డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉంటాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్ధుల వయసు ఫిబ్రవరి 1, 2022 నాటికి తప్పనిసరిగా 18 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు నవంబర్ 12 తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధి ఎంపిక ఉంటుంది. ఈ పోస్టులో ఎంపికైన వారికి నెలకు రూ.10,000ల చొప్పున జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి గల అభ్యర్ధులు ఈ పోస్టుకు సంబంధిచిన పూర్తి వివరాలను https://licindia.in/ చూడవచ్చు.