ఇండియన్ నేవీలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభమైంది. 10+2 అర్హత ఉంటే కనుక మీరు నెలకు రూ. 30 వేలు జీతం అందుకునే అవకాశం ఉంటుంది.
ఇండియన్ నేవీలో చేరాలనేది మీ కల. అయితే మీ కోసమే ఈ సువర్ణావకాశం. నెలకు మంచి జీతంతో పాటు ఏడాదికొకసారి జీతంలో పెంపు ఉంటుంది. అగ్నివీర్ పోస్టులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఇండియన్ నేవీ మే 29 నుంచి ప్రారంభించింది. అగ్నివీర్ ఎస్ఎస్ఆర్, అగ్నివీర్ ఎంఆర్ పోస్టుల రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు తమ అర్హతను చెక్ చేసుకుని అధికారిక వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఇండియన్ నేవీ 1365 పోస్టులను భర్తీ చేయనుంది. మహిళలు కూడా ఈ పోస్టులకు అర్హులే. గరిష్టంగా 273 మంది మహిళలను రిక్రూట్ చేయనుంది ఇండియన్ నేవీ.
పోస్టులు: 1365
పరీక్ష ఫీజు: రూ. 550 + 18% జీఎస్టీ
దరఖాస్తు చివరి తేదీ: 15 జూన్ 2023