నిరుద్యోగులకు ఇది సూపర్ గుడ్ న్యాస్ అనే చెప్పాలి. ఎందుకంటే వెయ్యి కాదు.. రెండు వేలు కాదు.. ఏకంగా 98,083 ఖాళీలను పోస్టాఫీస్ భర్తీ చేయనుంది. అవును మీరు విన్నది నిజమే.. త్వరలోనే రీజియన్ల వారీగా నోటిఫికేషన్లను కూడా విడుదల చేయనున్నారు. ఈ వార్త విన్న నిరుద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈ పోస్టులను భర్తీ చేయనుండగా.. అసలు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఆ ఉద్యోగాల భర్తీకి ఎవరు అర్హులు? ఏ రీజియన్ల వారీగా ఎన్ని ఖాళీలున్నాయి? అసలు జీతం ఎంత? ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి? అనే పూర్తి వివరాలను ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
పోస్టాఫీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక ప్రకటన జారీ చేసింది. రీజియన్ల వారిగా నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటన జారీ చేసింది. ఆ ప్రకటనలో పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నట్లు వివరించింది. ఈ ప్రకటన ప్రకారం.. పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలు 59,099, మెయిల్ గార్డ్ ఉద్యోగాలు 1,445, ఎంటీఎస్ పోస్టులు 37,539 ఉన్నట్లు వివరించింది. పోస్ట్ మ్యాన్ ఉద్యోగాల భర్తీకి మాత్రం ఇంటర్ అర్హత ఉండాలని చెబుతున్నారు. అలాగే మిగిలిన అన్ని పోస్టుల భర్తీకి కేవలం పదో తరగతి ఉత్తీర్ణులై ఉంటే సరిపోతుంది. అలాగే పోస్టు ఏదైనా అభ్యర్థులు మాత్రం 18 నుంచి 32 ఏళ్ల మధ్య వయసు వాళ్లు అయి ఉండాలి. ఈ నెలలోనే అన్ని ఉద్యోగాలకు సంబంధించి రీజియన్ల వారీగా విడి విడిగా నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. ఆన్ లైన్ ద్వారా మీకు కావాల్సిన పోస్టుకు అర్హతను బట్టి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ వరకు ఔత్సాహికుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.
వచ్చే జనవరిలో అభ్యర్థులకు రాత పరీక్షను నిర్వహించనున్నారు. రాత పరీక్ష తర్వాత అర్హత సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్.. ఆ తర్వాత ఫైనల్ లిస్ట్ ను విడుదల చేస్తారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. మొత్తం పోస్టుల్లో ఏపీ పరిధిలో 2,289 పోస్ట్ మ్యాన్, 108 మెయిల్ గార్డు, 1,166 ఎంటీఎస్ పోస్టులు ఉన్నాయి. అలాగే తెలంగాణ సర్కిల్ లో పోస్ట్ మ్యాన్ పోస్టులు 1,553, మెయిల్ గార్డు పోస్టులు 82, ఎంటీఎస్ పోస్టులు 878 ఉన్నాయి. అతి త్వరలోనే ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లను కూడా తపాలా శాఖ విడుదల చేయనుంది. సర్కిళ్ల వారీగా అత్యధికంగా మహారాష్ట్ర పరిధిలో 9,884 పోస్ట్ మ్యాన్ పోస్టులు, 147 మెయిల్ గార్డు పోస్టులు, 5,478 ఎంటీఎస్ పోస్టులు ఉన్నాయి. అత్యల్పంగా ఛత్తీస్ గఢ్ సర్కిల్ లో 613 పోస్ట్ మ్యాన్ పోస్టులు, 16 మెయిల్ గార్డు పోస్టులు, 346 ఎంటీఎస్ పోస్టులు ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం.. పోస్టాఫీస్ వెబ్ సైట్: https://www.indiapost.gov.in/vas/Pages/IndiaPostHome.aspx ను సందర్శించండి.