తమ పిల్లలు బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడాలని ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు భావిస్తారు. మరి కన్న వారి కలలను నిజం చేయాలంటే యువతీ, యువకులు శ్రమించాల్సి ఉంటుంది. అయితే కొంతమంది ప్రైవేట్ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తారు. మరి కొంత మంది ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఉంటారు. అలాంటి వారికి ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్ వారు శుభవార్తనందించారు.

పదోతరగతి పూర్తై ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు భారత తపాలా శాఖ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. 12,848 పోస్టుల భర్తీకి పోస్టల్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో స్పెషల్ జిడిఎస్ ఆన్ లైన్ ఎంగేజ్ మెంట్ కింద 5,746 పోస్టులు, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బిపిఎం) మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ఎబిపిఎం) కింద 7,082 పోస్టులకు నోటిఫికెషన్ విడుదలైంది.
ముఖ్యమైన సమాచారం:
అర్హతలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోబోయో అభ్యర్థులు పదోతరగతిలో మ్యాథ్య్ మరియు సైన్స్ సబ్జెక్టులు కలిగి ఉండి పాసై ఉండాలి. స్థానిక భాషపై పట్టుండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సైకిల్ నడపడం వచ్చి ఉండాలి.
వయసు:
11-06-2023 తేదీ నాటికి 18-40ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సి, ఎస్టీలకు ఐదేళ్లు, ఒబిసిలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీత భత్యాలు:
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులకు రూ. 12,000- రూ. 29,380 వరకు వేతనం ఉంటుంది. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులకు రూ. 10000-రూ. 24,470 వేతనం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
ఒబిసి అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. ఎస్సి, ఎస్టీ, దావ్యాంగులు, ట్రాన్స్ జెండర్ వారికి ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 22-05-2023
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11-06-2023
ధరఖాస్తు విధానం: ఆన్ లైన్
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..