సొంత ఊర్లో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగం చేసుకోవచ్చు. నెలకు పాతిక వేలు పైనే జీతం ఇస్తుంది. 12 వేలకు పైగా పోస్టులు పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి.
తెలుగు భాష వస్తే చాలు ఈ ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతం. పది పాసైతే నెలకు 29 వేల వరకూ జీతం ఇస్తారు. మొత్తం 12,828 పోస్టులు పడగా, తెలుగు రాష్ట్రాల్లో 214 పోస్టులు పడ్డాయి. ఇండియా పోస్ట్ లో ఇండియాలో పోస్టల్ సర్కిల్స్ లో భారీగా పోస్టులు పడ్డాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా పోస్టులు పడ్డాయి. అమలాపురం, అనకాపల్లి, అనంతపురం, ఏలూరు, రాజమండ్రి, ఆదిలాబాద్, హన్మకొండ, ఖమ్మం వంటి పోస్టల్ సర్కిల్స్ లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుల భర్తీ కోరుతూ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఇండియా పోస్ట్. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? దరఖాస్తు రుసుము ఎంత? ఏ ఏ సర్కిల్ లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి? జీతాలు ఎంత? వంటి వివరాలు మీ కోసం.
అభ్యర్థుల ఎంపిక: మార్కులు ఎక్కువ వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.