అత్యధిక జీతం వచ్చే టాప్ 10 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇవే..

ఐటీ సెక్టార్ లో అత్యధిక జీతం వచ్చే సాఫ్ట్ వేర్ జాబ్స్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఐతే మీ కోసమే ఈ కథనం.

  • Written By:
  • Publish Date - June 1, 2023 / 08:41 PM IST

ఐటీ జాబ్స్ అంటేనే అత్యధిక జీతం కలిగిన సెక్టార్. ఎక్కువ మంది తమ క్వాలిఫికేషన్, ఇంజనీరింగ్ బ్రాంచ్ తో సంబంధం లేకుండా కోర్సులు నేర్చుకుని ఐటీ రంగంలో స్థిరపడాలని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఐటీ పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటోంది. చాలా కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కానీ డేటా అనలిటిక్స్, సెక్యూరిటీ, క్లౌడ్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ కు డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. అలానే స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కి కూడా భారీగానే డిమాండ్ ఉంది. 2023 డైస్ టెక్ శాలరీస్ నివేదిక ప్రకారం.. సైబర్ సెక్యూరిటీ, డేటా, డెవలప్మెంట్, ప్రోగ్రాం మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ లలో ఆరు అంకెల జీతం పొందే అవకాశం ఉన్నాయి. అయితే ఏ నిపుణుడికి ఎంత జీతం ఉంటుంది? ఏ ఉద్యోగానికి అధిక జీతం ఉంటుంది? అత్యధిక జీతాలు వచ్చే సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఏంటి? అనే వివరాలు మీకోసం.

ఎంఐఎస్ మేనేజర్:

కంపెనీ ఐటీ స్ట్రాటజీ, కంపెనీ సిస్టమ్ ను పర్యవేక్షించడం, ఐటీ నిపుణుల బృందాన్ని మేనేజ్ చేయడం ఎంఐఎస్ మేనేజర్ రోల్. ఐటీ సిస్టమ్స్ ప్లానింగ్, డెవలప్ మరియు ఇంప్లిమెంట్ చేయడం, నిర్వహించడం వంటి వాటికి బాధ్యత వహిస్తారు. ఐటీ సెక్యూరిటీ, డేటా ప్రైవసీ వంటి సబ్జెక్ట్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఈ జాబ్ కి రూ. 98 లక్షల ప్యాకేజ్ ఉంటుంది.

DevOps ఇంజనీర్:

మౌలిక సదుపాయాలు, సాధనాలను నిర్మించడం, సాఫ్ట్ వేర్ ని పరీక్షించడం, నిర్వహించడం ద్వారా సాఫ్ట్ వేర్ ని అభివృద్ధి చేయడం, విడుదల చేయడం DevOps ఇంజనీర్ యొక్క బాధ్యత. వీరికి కోడింగ్, స్క్రిప్టింగ్, సెక్యూరిటీ, అనలిటిక్స్, ఆటోమేషన్, డేటా మేనేజ్మెంట్, ఐటీ ఆపరేషన్స్ వంటి వాటిలో స్కిల్స్ ఉండాలి. ఈ ఉద్యోగానికి రూ. కోటి 3 లక్షల జీతం ఇస్తారు.

ప్రాడెక్ట్ మేనేజర్:

కంపెనీ ప్రారంభించిన ఉత్పత్తులు, సర్వీసులు వినియోగదారుని అంచనాలను అనుగుణంగా ఉండేలా, వ్యాపార అవసరాలకు, ఇండస్ట్రీ ట్రెండ్ లకు అనుగుణంగా ఉండేలా చూడడం ప్రాడెక్ట్ మేనేజర్ పని. ఈ ఉద్యోగానికి రూ. కోటి 3 లక్షల జీతం ఇస్తారు.

ప్రోగ్రాం అనలిస్ట్/మేనేజర్:

ఐటీ ప్రాజెక్టులు నిర్ణీత సమయంలో, బడ్జెట్ లో పూర్తయ్యేలా చూడడం ప్రోగ్రాం అనలిస్ట్ లేదా ప్రోగ్రాం మేనేజర్ పని. ఈ జాబ్ కి డేటా మేనేజ్మెంట్, ఆర్గనైజేషన్, కమ్యూనికేషన్, అనలిటిక్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ లో నైపుణ్యం ఉండాలి. జీతం రూ. కోటి 3 లక్షలు ఉంటుంది.

క్లౌడ్ ఆర్కిటెక్ట్/ఇంజనీర్:

క్లౌడ్ సిస్టమ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్, బిల్డింగ్ కి క్లౌడ్ ఆర్కిటెక్ట్ లేదా క్లౌడ్ ఇంజనీర్ పని చేస్తారు. క్లౌడ్ ఆర్కిటెక్ట్ లు క్లౌడ్ సిస్టమ్స్ కోసం ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేస్తే.. క్లౌడ్ ఇంజనీర్లు సిస్టమ్ లను బిల్డ్ చేస్తారు. ఇద్దరూ క్లౌడ్ టెక్నాలజీలో స్కిల్స్ కలిగి ఉండాలి. అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఐటీఎస్ఎం, ఐ&ఓ, ఆటోమేషన్ అండ్ వెండర్ మేనేజ్మెంట్ లాంటి క్లౌడ్ సర్వీసెస్ పై పట్టు ఉండాలి. ఈ జాబ్ కి రూ. కోటి 8 లక్షల జీతం వస్తుంది.

సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్/ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్:

సైబర్ థ్రెట్ ల నుంచి కంప్యూటర్ సిస్టమ్ లు, నెట్ వర్క్ లు, సాఫ్ట్ వేర్ లను రక్షించడానికి సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్ లు, సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్లు పని చేస్తారు. అప్లికేషన్స్ లో సెక్యూరిటీ మెజర్స్ ని అమలుచేయడానికి డెవలపర్స్ తో కలిసి పని చేస్తారు. వీరికి రూ. కోటి 8 లక్షల జీతం ఇస్తారు.

సిస్టమ్ ఆర్కిటెక్ట్:

హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్, నెట్ వర్క్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ మరియు మేనేజ్ చేసే వారిని సిస్టమ్ ఆర్కిటెక్ట్ అంటారు. సంస్థ గోల్స్, బడ్జెట్ కు అనుగుణంగా టెక్నాలజీ సొల్యూషన్స్ గుర్తిస్తారు. సిస్టమ్ ఆర్కిటెక్ట్ లకు పెర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్, రిస్క్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ వంటి వాటిలో స్కిల్స్ ఉండాలి. ఈ జాబ్ కి రూ. కోటి 11 లక్షల జీతం చెల్లిస్తారు.

ప్రిన్సిపల్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్:

ప్రిన్సిపల్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనేది సీనియర్ లెవల్ టెక్నికల్ రోల్. హై క్వాలిటీ, స్కేలబుల్ సాఫ్ట్ వేర్ ను డెవలప్ చేయడానికి ఇంజనీర్ల టీమ్ కి నాయకత్వం వహిస్తారు. ఇంజనీర్లు రాసిన కోడ్ ని రివ్యూ చేయడం, సాఫ్ట్ వేర్ సిస్టమ్ ల కోసం ఆర్కిటెక్చర్ ని రూపొందించడం, వ్యాపార అవసరాల కోసం టెక్నాలజీని గుర్తించడం వంటి బాధ్యతలను కలిగి ఉంటారు. టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఈ జాబ్ కి రూ. కోటి 14 లక్షల ప్యాకేజ్ ఇస్తారు.

సొల్యూషన్ ఆర్కిటెక్ట్:

కంపెనీ అవసరాలను తీర్చే ఐటీ సిస్టమ్ లు, సాఫ్ట్ వేర్ లను రూపొందించడంలోనూ, అమలు చేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తారు. ప్రస్తుత ఆర్కిటెక్చర్ ను అనాలసిస్ చేసి దాన్ని మరింత మెరుగుపరచడానికి మార్పులను సూచించడం సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ల పని. ఐటీ, సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, సంబంధిత విభాగంలో డిగ్రీ కలిగి ఉండాలి. జావా, జావా స్క్రిప్ట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, టెక్నికల్ నాలెడ్జ్, ఆర్కిటెక్చర్ డిజైన్ వంటి వాటిలో నైపుణ్యం ఉండాలి. ఈ జాబ్ కి రూ. కోటి 16 లక్షల ప్యాకేజ్ ఉంటుంది.

ఐటీ మేనేజ్మెంట్:

ఐటీ సెక్టార్ లో అత్యధిక జీతం అందుకునే జాబ్స్ లో ఐటీ మేనేజ్మెంట్ రోల్ ఒకైట్. సీఐఓ, సీటీవో, వీపీ, ఐటీ డైరెక్టర్లు ఉంటారు. కంపెనీ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ కి బాధ్యత వహిస్తారు. ఐటీ స్ట్రాటజీ, ఆపరేషన్స్, రీసోర్సెస్, గోల్స్ పై సీఐఓ దృష్టిపెడితే.. టెక్నికల్ రీసెర్చ్, డెవలప్మెంట్ ఎఫర్ట్స్ పై సీటీఓ దృష్టి సారిస్తారు. ఐటీ ఆపరేషన్స్ అంశాలను ఐటీ వీపీ పర్యవేక్షించగా.. ఐటీ ఆపరేషన్స్ లో బృందాలు లేదా విభాగాలను ఐటీ డైరెక్టర్ నిర్వహిస్తారు. ఈ జాబ్ కి రూ. కోటి 23 లక్షల జీతం చెల్లిస్తారు.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest jobsNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed