మీరు ఇంటర్ పూర్తి చేశారా? ఐతే ఈ ప్రభుత్వ డేటా ఎంట్రీ జాబ్ మీ కోసమే. నెలకు రూ. 25 వేల నుంచి రూ. 92 వేల వరకూ జీతం పొందే అద్భుతమైన అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి.
బయట ఎక్కడ చూసినా డేటా ఎంట్రీ జాబ్ స్కాములే జరుగుతున్నాయి. దీంతో డేటా ఎంట్రీ జాబ్ వెతకాలంటేనే జనం భయపడిపోతున్నారు. డేటా ఎంట్రీ స్కిల్స్ ఉండి కూడా చాలా మంది చిన్న చిన్న జీతాలకు పని చేస్తూ సర్దుకుపోతున్నారు. మరి కొంతమంది అయితే ఎక్కడా ఉద్యోగం దొరక్క నిరుద్యోగులుగా ఉంటున్నారు. మీకు ఇంటర్ అర్హత ఉంటే కనుక ఈ ప్రభుత్వ డేటా ఎంట్రీ జాబ్ మీ కోసమే. నెలకు రూ. 25 వేల నుంచి రూ. 92 వేల వరకూ జీతాలు ఇస్తుంది. పలు మంత్రిత్వ శాఖలు, డిపార్టుమెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, రాజ్యాంగ సంస్థలు, చట్టబద్ధమైన సంస్థలు, న్యాయస్థానాల్లో లోయర్ డివిజనల్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టుల నియామకం చేపట్టనుంది. ఈ గ్రూప్ సి పోస్టుల రిక్రూట్మెంట్ కి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీజీఎల్ లెవల్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.