భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన “సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ-డ్యాక్) సంస్థలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ పడింది. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై సహా దేశంలోని పలు నగరాలకు చెందిన సీ-డ్యాక్ సెంటర్స్ లో ఖాళీలు ఉన్నాయి. ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ విభాగాల్లో 530 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అనుభవం లేకపోయినా 3.6 లక్షల నుంచి 5 లక్షల వరకూ జీతం పొందవచ్చు. అనుభవం ఉంటే రూ. 7 లక్షల నుంచి 22 లక్షల వరకూ జీతం పొందవచ్చు. పోస్టులు, దానికి సంబంధించిన అర్హతలు, వివరాలు మీ కోసం.