పేద విద్యార్థులకు చేయూతను అందించేందుకు కార్పొరేట్ సంస్థలు ఒక్కొక్కటిగా ముందుకు వస్తున్నాయి. మీ చదువుకు మాది భరోసా అంటూ రాజకీయ నాయకుల్లా మాటలు చెప్పకుండా.. స్కాలర్ షిప్ లు అందిస్తూ వారిని పైచదువులు.. చదివేలా ప్రోత్సహిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ విభాగం హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్.. విద్యాధన్ స్కాలర్‌షిప్ పేరుతో స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. ప్రతిభ ఉండి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులు చదువలేకపోతున్న పేద విద్యార్థులకు చేయూతనందిచాలన్న సంకల్పతో ఈ ముందడగు వేసింది.
అర్హతలు:
ఇంటర్మీడియట్, డిగ్రీ(గ్రాడ్యుయేషన్), పోస్టు గ్రాడ్యుయేషన్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ పొందడానికి అర్హులు. అభ్యర్థులు ముందు తరగతిలో కచ్చితంగా 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. అలాగే కుటుంబ వార్షిక ఆదాయం రూ.3,60,000 లోపు ఉండాలి.
స్కాలర్‌షిప్ ఎంతంటే..?
ఇంటర్ విద్యార్థులకు ఏడాదికి రూ.10,000 చొప్పున రెండేళ్లు
డిగ్రీ విద్యార్థులకు ఏడాదికి రూ.15,000 చొప్పున మూడేళ్లు
పీజీ విద్యార్థులకు ఏడాదికి రూ.20,000 చొప్పున రెండేళ్లు
అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 30 దరఖాస్తులకు చివరితేది. పూర్తి వివరాలకు లింక్ https://www.buddy4study.com/page/lic-hfl-vidhyadhan-scholarship పై క్లిక్ చేయండి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియయజేయండి.
LIC HFL VIDYADHAN SCHOLARSHIP 2022
Last Date: 30th September 2022 pic.twitter.com/OsysHPDZ7b— Govardhan Reddy (@gova3555) July 18, 2022
ఇది కూడా చదవండి: IBPS RRB: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 8,106 బ్యాంకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఇది కూడా చదవండి: BSNLలో ఉద్యోగాలు.. అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక!