భారత ప్రభుత్వ ఆహారం, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఎఫ్‌సీఐలో ఉన్న 5043 నాన్ ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్‌ల వారీగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం ఖాళీలు: 5043
విభాగాలు:
జోన్ల వారీగా ఖాళీలు:
అర్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, బీకాం, బీఎస్సీ(అగ్రికల్చర్/బోటనీ/జువాలజీ/ బయో టెక్నాలజీ/బయో-కెమిస్ట్రీ/మైక్రోబయాలజీ/ఫుడ్ సైన్స్), బీఈ, బీటెక్ (ఫుడ్ సైన్స్), ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ/అగ్రికల్చరల్ ఇంజినీరింగ్/బయో- టెక్నాలజీ/ సివిల్), డిప్లొమా (సివిల్/మెకానికల్) ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి: అభ్యర్థుల వయసు 21 నుంచి 28 యేళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష (పేజ్-1, ఫేజ్ -2), స్కిల్/ టైపింగ్ టెస్టు(స్టెనో పోస్టులకు).
జీతభత్యాలు: పోస్టులను అనుసరించి నెలకు రూ.28,200ల నుంచి రూ.1,03,400ల వరకు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తు రుసుము: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తు ప్రారంభ తేదీ: 06.09.2022.
దరఖాస్తుకు చివరి తేదీ: 05.10.2022.
పరీక్ష తేదీ: జనవరి, 2023.
తెలుగు రాష్ట్రాల్లో ఫేజ్-1 పరీక్షా కేంద్రాలు: నెల్లూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
రాత పరీక్ష విధానం:
ఫేజ్- 1: ఈ పరీక్షలో మొత్తం 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు 100 మార్కులకు గానూ మొత్తం 60 నిముషాల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ అప్టిట్యూడ్, జనరల్ స్టడీస్ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. తప్పు ప్రశ్నలకు 1/4 విధానంలో మార్కుల్లో కొత్త ఉంటుంది.
ఫేజ్-2: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఫేజ్-2 పరీక్ష ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాలకు నోటిఫికేషన్ లేదా https://fci.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.