మీరు నిరుద్యోగులా..? ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా..? ఐతే మీకో శుభవార్త. 2,674 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ వెలువడింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగుల భవిష్యనిధి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. దేశంలోని వివిధ రీజియన్లలో ఖాళీగా ఉన్న 2,674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ (ఎస్‌ఎస్‌ఏ- గ్రూప్ సీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 155 (ఏపీ-39, తెలంగాణ-116) ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.
మొత్తం ఖాళీలు: 2,674
విభాగాలు: సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్
అర్హతలు: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.
వయో పరిమితి: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వడ్ కేటగిరీ అభ్యర్థులకు రిజర్వేషన్ల వారిగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళ అభ్యర్థులు/మాజీ సైనికులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. మిగిలిన అభ్యర్థులు రూ.700 చెల్లించాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
జీతభత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.29,200ల నుంచి రూ.92,300ల వరకు వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 27.03.2023
దరఖాస్తులుకు చివర తేదీ: 26.04.2023