సొంత ఊరిలా ఉంటూ ఉద్యోగం చేయాలన్నది మీ లక్ష్యమా..? అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మహిళాభివృధి మరియు శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం నందు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేయుటకు నోటిఫికేషన్ వెలువడింది.
మహిళాభివృధి మరియు శిశు సంక్షేమ శాఖ జనగాం జిల్లా మహిళా సాధికారత కేంద్రం నందు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేయుటకు ఆసక్తిగల వారి నుండి దరఖాస్తులు కోరుతోంది. ఈ ప్రకటన ద్వారా జిల్లా మిషన్ కో-ఆర్డినేటర్, జెండర్ స్పెషలిస్ట్, ఫైనాన్షియల్ లిటరసీ స్పెషలిస్ట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 29లోపు దరఖాస్తు చేసుకోగలరు. అర్హతలేంటి..? ఎలా ఎంపిక చేస్తారు..? జీతభత్యాలు ఎలా ఉంటాయి..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం ఖాళీలు: 4
విభాగాలు:
వయోపరిమితి: 28/03/2023 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వడ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోసడలింపు ఉంది.
జీతభత్యాలు: పోస్టులను అనుసరించి రూ. 15,600 నుంచి రూ. 38,500 వరకు వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించనవసరం లేదు.
దరఖాస్తు చేయు విధానం: దరఖాస్తు ఫారంను నింపి అందుకు సంబంధించిన ధ్రువపత్రాలను జత చేసి కింద చిరుమానా పంపగలరు.
చిరుమానా:
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 19.04.2023
దరఖాస్తులకు చివరి తేదీ: 29.04.2023