భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఎండిసి) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా జాయింట్ కంపెనీ సెక్రటరీ, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, జూనియర్ మేనేజర్ వంటి ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ.. 25 నవంబర్ 2022. అర్హతలు ఏంటి? దరఖాస్తు ఎలా చేసుకోవాలి? అన్నది ఇప్పుడు చూద్దాం..
విభాగాలు:
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో 10+2, గ్రాడ్యుయేషన్/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా/ ఎంఎస్సీ/ ఎంఏ ఉత్తీర్ణులై ఉండాలి. మరిన్ని విద్యార్హత వివరాల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ చూడండి.
వయో పరిమితి:
అభ్యర్థుల వయసు 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. (SC/ ST/OBC/PWD/ PH అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది)
దరఖాస్తు ఫీజు:
జనరల్/ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 500. (SC/ST/PwBD/Ex-servicemen మరియు NMDC లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు)
జీతభత్యాలు:
ఎంపిక ప్రక్రియ:
ఆన్‌లైన్ టెస్ట్/వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు చేయు విధానం: ఆన్ లైన్
దరఖాస్తులకు ప్రారంభ తేదీ: 5 నవంబర్ 2022.
దరఖాస్తులకు చివరి తేదీ: 25 నవంబర్ 2022.