ప్రపంచాన్ని గజ గజ వణికించింది కరోనా మహమ్మారి. ప్రాణ నష్టమే కాదు.. ఆర్థిక నష్టాన్ని కూడా మిగిల్చింది. దీంతో ఎన్నో దిగ్గజ కంపెనీలు దివాల తీశాయి. ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులను వేల సంఖ్యలో తీయాల్సిన పరిస్థితి నెలకొంది.
నేటి సమాజంలో ఉన్నత విద్య ఉంటేనే మంచి గౌరవం లభిస్తుంది.. మన కలలు సాకారం చేసుకోవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్యను అందించేందుకు ఎన్నో కష్టపడుతున్నారు. లక్షలు పోసి ఇంజనీరింగ్ కోర్సులు పూర్తి చేసి తీరా కొలువుల కొరకు ఏదైనా కోర్సులు చేయాల్సి వస్తుంది. కోవిడ్ పరిస్థితుల తర్వాత ఐటీ వ్యవస్థ అస్తవ్యస్తం అయ్యింది. దీంతో కొత్త ఉద్యోగాలు దొరకడం చాలా కష్టతరంగా మారిందని అంటున్నారు. అంతేకాదు ఇటీవల దిగ్గజ కంపెనీలు వెల సంఖ్యల్లో ఉద్యోగులను తొలగించేస్తున్నారు. ఈ విషయం కొత్తగా ఐటీ కోర్సుల్లో శిక్షణ పొందుతున్నవారు కలవరపడుతున్నారు.
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఒక్క కుదుపు కుదిపేసింది. ఆర్థిక, ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. కోవిడ్ పరిణామాల తర్వాత ఎన్నో దిగ్గజ కంపెనీలు తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించాయి. ఈ క్రమంలో కొత్తగా ఐటీ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ఉద్యోగాల విషయమై కలవరం పెరుగుతోంది. క్యాంపస్ సెలెక్షన్స్ లో సెలెక్ట్ అయిన విద్యార్థులు విధుల్లో చేరడానికి చాలా కాలంపాటు ఎదురుచూడవలసి వస్తుంది. చిన్నచిన్న కంపెనీల నుండి ఐటీ సంస్థల దాకా ఇదే పరిస్థితి నెలకొంది. జాబ్ ఆఫర్ లెటర్ ఇచ్చి సంవత్సరం దాటినా ఉద్యోగాల్లో చేరడానికి జాప్యం జరుగుతుంది. ఉద్యోగం పొందినట్లే అని సంతోషపడ్డ స్టూడెంట్స్ కి ఆశలు అడియాసలవుతున్నాయి. గత సంవత్సరం ఆగస్టులో తెలంగాణలో మల్టీ నేషనల్ కంపెనీలు, అంకుర సంస్థలు, చిన్నఐటీ కంపెనీలు అన్ని కలిపి 24,500 మందిని క్యాంపస్ సెలెక్షన్స్ ద్వారా ఎంపిక చేసుకున్నాయి.
ఇప్పటివరకు 2,300 మందికి మాత్రమే ఉద్యగాల నియామక పత్రాలు అందాయి. కొన్ని కంపెనీలు మాత్రం క్యాంపస్ నియామకాల్లో ఎంపిక చేసుకున్నవారిని ఉద్యోగాలకు తీసుకున్నాయి. కోవిడ్ తర్వాత అనుకున్నంత మేరగా ప్రాజెక్టులు రావడం లేదని, అవసరమైనంత మేరకే సిబ్బందిని తీసుకుంటున్నామని తెలిపాయి. గత నెలలో ప్రపంచవ్యాప్తంగా 570 కంపెనీలు 1.70 లక్షల మంది ఐటీ జాబ్స్ తొలగించినట్లు లేఆఫ్స్ ఎఫ్ వైఐ సంస్థ తెలిపింది. ఈ సంవత్సరం ఇలాగే కొనసాగుతుందని, వచ్చే ఏడాది వరకు ఇంజనీరింగ్ విద్యార్థులు క్యాంపస్ నియామకాలపై ఆశలు పెట్టుకోకుండా ఉంటేనే మంచిదని సూచిస్తున్నారు. ఎందుకంగే ఆఫర్ లెటర్స్ ఇచ్చినంత మేరకు జాబ్ అపాయింట్ మెంట్ కావట్లేదు. క్యాంపస్ సెలెక్షన్స్ పై ఉద్యోగాలు రాని విద్యార్థుల కలవరంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.