చాలా మంది యువత ప్రభుత్వం ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. అందుకు కోసం పట్టుదలతో నిత్యం శ్రమిస్తూ ఉంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా? అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటారు. అలా ప్రభుత్వ నుంచి జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు శుభవార్త. రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా రైల్వేలోని స్టెనో గ్రాఫర్, గూడ్స్ గార్డ్, జూనియర్ అకౌంటెట్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.
ప్రభుత్వ నుంచి జాబ్ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు రైల్వే సంస్థ శుభవార్త తెలిపింది. రైల్వేలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 596 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టెనో గ్రాఫర్, గూడ్స్ గార్డ్, జూనియర్ అకౌంటెట్ వంటి విభాగాల్లో 596 పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. రైల్వే రిక్రూట్ మెంట్ సెల్, సెంట్రల్ రైల్వే కామన్ డిపార్ట్మెంటల్ కాంపిటీటివ్ పరీక్ష ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక ఏ ఏ విభాగాల్లో పోస్టుల ఖాళీలు ఉన్నాయో..ఇప్పుడు చూద్దాం..
స్టెనోగ్రాఫర్-4, టికెట్ క్లర్క్-154, గూడ్స్ గార్డ్- 46, స్టేషన్ మాస్టర్- 75, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్- 150, జూనియర్ క్లర్క్ కమ్ టికెట్ క్లర్క్- 126, అకౌంట్స్ క్లర్క్- 37 ఖాళీలు ఉన్నాయి.
రైల్వేశాఖ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు అప్లయ్ చేయలనుకునే వారు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. అంతే కాక కొన్ని విభాగాలకు టైపింగ్ స్కిల్స్ ఉండాలి. 50 నిమిషాల ట్రాన్స్ క్రిప్షన్ సమయంతో పాటు 10 నిమిషాల వ్యవధికి నిమిషానికి 80 పదాల షార్ట్‌హ్యాండ్ స్పీడ్ కలిగి ఉండాలి. మరికొన్ని పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ లేదా అర్హత కలిగి ఉండాలి.
జనరల్ అభ్యర్థులకు 42 ఏళ్లు, ఇతర వెనుకబడిన తరగతులు 45 ఏళ్లు, రిజర్వడ్ కేటగిరీ వాళ్లకు 47 ఏళ్ల వయోపరిమితి ఉండాలి.
రాత పరీక్ష, నైపుణ్య పరీక్ష, పత్రాల ధృవీకరణ, మెడికల్ టెస్ట్ ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్షలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కుల నెగిటివ్ మార్క్ ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు రైల్వే శాఖకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకోసం https://rrccr.com/ ని చూడండి.దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 28 నుంచి ప్రారంభమై..నవంబర్ 28 ముగుస్తుంది.