ప్రభుత్వ టెలికాం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు అప్రెంటిస్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌తో పాటు సీఏ/ పీజీ/ సీఎఫ్‌ఏ /ఐసీడబ్ల్యూఏ/ సీఎంఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎలాంటి రాత పరీక్ష నిర్వహించడం లేదు. అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ: జులై 19, 2022.
మొత్తం ఖాళీల సంఖ్య: 44
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.bsnl.co. in