మీరు నిరుద్యోగులా..? అయితే మీకో గుడ్ న్యూస్. మెట్రోలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నిరుద్యోగ యువతకు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ శుభవార్త చెప్పింది. డిప్యూటీ చీఫ్ ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా సిగ్నలింగ్, రోలింగ్ స్టాక్, టెలికమ్యునికేషన్, ట్రాక్షన్, ఈసీఎస్, డిపో మెషినరీ, ఆపరేషన్ సేఫ్టీ తదితర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. బీఈ, బీటెక్, ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమాలో ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
మొత్తం ఖాళీలు: 68
విభాగాలు: సిగ్నలింగ్, రోలింగ్ స్టాక్, టెలికమ్యునికేషన్, ట్రాక్షన్, ఈసీఎస్, డిపో మెషినరీ, ఆపరేషన్ సేఫ్టీ మొదలుగునవి.
విద్యార్హతలు: పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్, ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమాలో ఉత్తీర్ణులైన వారు అర్హులు.
వయోపరిమితి: 40-55 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు:
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు చేయు విధానం: అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకొని అనంతరం దరఖాస్తు హార్డ్ కాపీని ఆఫ్‌లైన్ విధానంలో కింద చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
జనలర్ మేనేజర్,
బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్,
3వ అంతస్తు, బీఎమ్‌టీసీ కాంప్లెక్స్,
శాంతినగర్, బెంగళూరు 560027
దరఖాస్తులకు చివరి తేది: 17 ఏప్రిల్ 2023.