ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. మెట్రోలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
మీరు నిరుద్యోగులా..! అయితే మీకో గుడ్ న్యూస్. మెట్రోలో ఉద్యోగాలు వెలుబడ్డాయి. డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్, ఫైర్‌మెన్ ఉద్యోగాల భర్తీకి బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఉద్యోగాలకు బీఎస్ సీ అర్హత కాగా, ఫైర్‌మెన్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ అర్హతగా నిర్ణయించారు. మెట్రోలో ఉద్యోగాల కోసం వేచిచూస్తున్న వారికి ఇదొక సువర్ణావకాశం. ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? జీతభత్యాలు ఎలా ఉంటాయి..? మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం..
మొత్తం ఖాళీలు: 26
విద్యార్హతలు: డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేయు అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్‌సీ ఉత్తీర్ణులై ఉండాలి. ఫైర్‌మెన్ పోస్టులకు ఇంటర్మీడియట్ కనీస విద్యార్హత.
వయోపరిమితి: డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఉద్యోగాలకు అభ్యర్థుల వయసు 62 ఏళ్లు మించకూడదు. అలాగే, ఫైర్‌మెన్ పోస్టులకు 25 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు:
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా..
దరఖాస్తు చేయు విధానం: అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకొని అనంతరం దరఖాస్తు హార్డ్ కాపీని ఆఫ్‌లైన్ విధానంలో పంపించాలి.