మీరు బీఈ/ బీటెక్ వంటి పైచదువులు చదివారా..? మీ చదువుకు తగ్గ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అవకాశాన్ని అసలు మిస్ చేసుకోకండి.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 428 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఇందులో ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రైనీ ఇంజినీర్ అను రెండు విభాగాల్లో భర్తీ చేపడుతున్నారు. సంబంధిత విభాగాల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ ఉట్టెర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. అర్హత, ఆసక్తి గల వారు మే 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోగలరు.
మొత్తం ఖాళీలు: 428
ప్రాజెక్ట్ ఇంజినీర్: 327
విభాగాల వారీగా ఖాళీలు:
ట్రెయినీ ఇంజినీర్: 101
విభాగాల వారీగా ఖాళీలు:
విద్యార్హతలు: ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉఖాళీలకు సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత, ట్రెయినీ ఇంజినీర్ ఖాళీలకు కనీసం 55 శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణులైన వారు అర్హులు.
వయోపరిమితి: ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలకు అభ్యర్థుల వయసు 32 సంవత్సరాలు మించకూడదు. అలాగే కనీసం 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. ఇక ట్రెయినీ ఇంజినీర్ ఖాళీలకు అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలు మించకూడదు.
జీతభత్యాలు: ప్రాజెక్ట్ ఇంజినీర్ గా ఎంపికైన వారికి మొదటి ఏడాది రూ.40,000, రెండో ఏడాది రూ.45,000, మూడో ఏడాది రూ.50,000, నాలుగో ఏడాది రూ.55,000 వేతనంగా చెల్లిస్తారు. ఇక ట్రెయినీ ఇంజినీర్ అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది రూ.35,000, మూడో ఏడాది రూ.40,000 వేతనంగా చెల్లిస్తారు. దీనికి అదనంగా ఏడాదికి రూ.12,000 అలవెన్సుల రూపంలో చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తు ఫీజు: ప్రాజెక్ట్ ఇంజినీర్ అభ్యర్థులు రూ.400, ట్రెయినీ ఇంజినీర్ అభ్యర్థులు రూ.150 చెల్లించాలి. దీనికి 18 శాతం జిఎస్‌టీ అదనం.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తులకు చివరితేది: 18.05.2023.