ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధీనంలోని భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్(బీసీసీఎల్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధీనంలోని భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్(బీసీసీఎల్) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 77 ఖాళీలు భర్తీ చేయనున్నారు. మైనింగ్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారు జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ఉన్న భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ కేంద్రంలో పనిచేయాల్సి ఉంటుంది. ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? జీతభత్యాలు ఎలా ఉంటాయి..? వంటి పూర్తి వివరాలు మీకోసం..
మొత్తం ఖాళీలు: 77
విభాగాలు: జూనియర్ ఓవర్‌మ్యాన్, టెక్నీషియన్ అండ్ సూపర్‌వైజర్ (గ్రేడ్-సి)
విద్యార్హతలు: అభ్యర్థులు మైనింగ్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, డిప్లొమాతో పాటు వ్యాలిడ్ ఓవర్‌మ్యాన్‌షిప్ కాంపిటెన్సీ సర్టిఫికేట్, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 02.05.2023 నాటికి ఓబీసీ అభ్యర్థులైతే 18 నుండి 33 ఏళ్ల మధ్య, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులైతే 18 నుండి 35 ఏళ్లలోపు ఉండాలి.
జీతభత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.31,852 ప్రారంభ వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు రూ.1180 దరఖాస్తు రుసుముగా చెల్లించాలి. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.
దరఖాస్తు ఫామ్‌లుపంపవలసిన చిరునామా:
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొదట 100 మార్కులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ఓసీబీ అభ్యర్థులు 40 శాతం, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు 35 శాతం మార్కులు సాధించాలి. ఈ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా 1:3 పద్ధతిలో అభర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు. వీరిని డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు అనుమతిస్తారు.
దరఖాస్తు ఫామ్‌లు పంపడానికి చివరి తేదీ: 25.05.2023 (సాయంత్రం 5 గంటలలోపు..)