చిన్న చిన్న చదువులు చదివారా..? ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్ష్యమా..? ఐతే ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. 4,374 ఉద్యోగాల భర్తీ కోసం భారత అణు పరిశోధనా కేంద్రం(బార్క్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వం ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం అని చెప్పొచ్చు.
భారత అణు శక్తి విభాగానికి చెందిన భాభా అణు పరిశోధనా కేంద్రం(బార్క్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 4,374 టెక్నికల్ ఆఫీసర్, స్టైపెండరీ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్‌సీ, ఎంఎస్‌సీ, ఎంఎల్‌ఐఎస్‌సీ విద్యార్హతలు నిర్ణయించారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు మే 22 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? జీతభత్యాలు ఎలా ఉంటాయి..? ఎంపిక విధానం..? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
స్టైపెండరీ ట్రైనీ:
అర్హతలు: పోస్టులను అనుసరించి టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్‌సీ, ఎంఎస్‌సీ, ఎంఎల్‌ఐఎస్‌సీ ఉత్తీర్ణులై ఉండాలి.
జీతభత్యాలు: టెక్నికల్ ఆఫీసర్‌గా ఎంపికైన వారికి రూ.56,100; సైంటిఫిక్ అసిస్టెంట్ అభ్యర్థులకు రూ.35,400; టెక్నీషియన్ అభ్యర్థులకు రూ.21,700 వేతనంగా చెల్లిస్తారు. ఇక స్టైపెండరీ ట్రైనీ విషయాలకొస్తే.. కేటగిరీ-1 ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.24,000 నుంచి రూ.26,000; కేటగిరీ-2కు రూ.20,000 నుంచి రూ.22,000 వేతనంగా చెల్లిస్తారు.
వయోపరిమితి: 22.5.2023 నాటికి టెక్నికల్ ఆఫీసర్ అభ్యర్థులకు 18 నుంచి 35 ఏళ్ళు కాగా, సైంటిఫిక్ అసిస్టెంట్‌కు 18 నుంచి 30 ఏళ్లు, టెక్నీషియన్‌కు 18 నుంచి 25 ఏళ్లు, స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ-1కు 19 నుంచి 24 ఏళ్లు, స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ-2కు 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: టెక్నికల్ ఆఫీసర్ అభ్యర్థులు రూ.500, సైంటిఫిక్ అసిస్టెంట్ అభ్యర్థులు రూ.150, టెక్నీషియన్ అభ్యర్థులు రూ.100, కేటగిరీ-1 పోస్టులకు రూ.150, కేటగిరీ-2 పోస్టులకు రూ.100 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం: ఖాళీలను అనుసరించి ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్‌ల ఆధారంగా ఎంపిక చేస్తారు.
తెలుగు రాష్ట్రాలలో పరీక్ష కేంద్రాలు: అమరావతి, గుంటూరు, హైదరాబాద్, కరీంనగర్, విజయవాడ, విశాఖపట్నం.
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 24-04-2023
దరఖాస్తులకు చివరి తేదీ: 22-05-2023