ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) హాస్పిటల్స్ లో భర్తీల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మెడిసన్ లోని పలు స్పెషలిస్ట్ విభాగాలకు సంబంధించి అభ్యర్థులను డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఆహ్వానిస్తోంది. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఒకే రోజులో ఎంపిక చేసి ఉద్యోగం ఇవ్వనున్నారు. అనుభవం లేకపోయినా పర్లేదు. మరి విద్యార్హతలు, ఇతర అర్హత ప్రమాణాలు ఏమిటి? ఏ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి? జీతం ఎంత? ఇంటర్వ్యూ తేదీ ఎప్పుడు? వంటి వివరాలు మీ కోసం.