ఎనిమిదో తరగతి ప్రవేశాలకు రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (ఆర్ఐఎంసీ)లో నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ రక్షణ శాఖకు చెందిన సంస్థల్లో పైచదువులు అభ్యసించాలనుకునేవారికి ఇది చక్కని అవకాశం. ఉన్నత విద్యను అందించడమే కాకుండా చక్కటి శిక్షణ అందిస్తారు.
దేశంలోనే పురాతన సైనిక కళాశాలగా పేరొందిన రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్(ఆర్ఐఎంసి) ఎనిమిదో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. భారత రక్షణ దళంలో చేరాలనుకునే అబ్బాయిలు, అమ్మాయిల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. కావున అలాంటి ఆసక్తి ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ఆర్ఐఎంసి సూచిస్తోంది. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు ఫారమ్‌లను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పించాలి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాలురు, బాలికల నుంచి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది. రాత పరీక్ష, వైవా-వోస్, వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది.
ఆర్ఐఎంసీలో ఎనిమిదో తరగతి ప్రవేశాలు (జనవరి- 2024)
అర్హత లు: 2024 జనవరి నాటికి ఏడో తరగతి చదువుతున్న లేదా ఎడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు.
వయసు: 01.01.2024 నాటికి పదకొండున్నర ఏళ్లకు తగ్గకుండా పదమూడేళ్లకు మించకుండా ఉండాలి. (అంటే.. 02.01.2011 – 01.07.2012 మధ్య జన్మించి ఉండాలి)
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, వైవా-వోస్ పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్షా విధానం:
రాత పరీక్షలో మొత్తం మూడు పేపర్లు(ఇంగ్లీష్, మ్యాథ్స్, జనరల్ నాలెడ్జ్) ఉంటాయి. ఇందులో మ్యాథమేటిక్స్(200 మార్కులు), ఇంగ్లిష్(125 మార్కులు), జనరల్ నాలెడ్జ్(75 మార్కులు) నుంచి ప్రశ్నలు ఉంటాయి. మ్యాథ్స్ పేపర్‌కు గంటన్నర సమయం ఉంటుంది. దీనిని హిందీ లేదా ఇంగ్లీష్ మీడియంలో రాయొచ్చు. జనరల్ నాలెడ్జ్ పేపర్‌కు గంట సమయం ఉంటుంది దీనిని కూడా ఇంగ్లీష్ లేదా హిందీ మీడియంలో రాయొచ్చు. ఇంగ్లీష్ పేపర్‌కు రెండు గంటల సమయం ఉంటుంది. అనంతరం మూడు పేపర్లలో కనీసం 50 శాతం చొప్పున మార్కులు సాధించి అభ్యర్థులకు వైవా-వోస్(50 మార్కులు) నిర్వహిస్తారు. ఈ రెండింటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు చివరిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ.600, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.555 చెల్లించాలి. అయితే ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ .
ఆర్ఐఎంసీ అధికారిక పోర్టల్‌లో నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం దరఖాస్తు ఫారం నింపి అవసరమైన ధ్రువతపత్రాలు జతచేసి అసిస్టెంట్ సెక్రటరీ(ఎగ్జామ్స్), ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, న్యూ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్స్ బిల్డింగ్, రెండో అంతస్తు, ఆర్టీఏ కార్యాలయం దగ్గర, ఎంజీ రోడ్డు, విజయవాడ చిరునామాకు పంపాలి.
దరఖాస్తు ఫారంతో పాటు పంపాల్సిన డాక్యుమెంట్స్
ముఖ్యమైన తేదీలు:
గమనిక: శిక్షణా కాల వ్యవధిలో తల్లిదండ్రుల అభ్యర్థనపై లేదా కళాశాల నిర్ణయం ఆధారంగా విద్యార్ధి ఏ సమయంలోనైనా వైదొలగవచ్చు. కాకుంటే శిక్షణపై అయ్యే మొత్తాన్ని వారానికి రూ. 2876 చొప్పున (దీనికి స్కాలర్‌షిప్ అమౌంట్ అదనం) రీఫండ్ చేయాల్సి ఉంటుంది.