నిరుద్యోగులకు శుభవార్త. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఏ ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న దానిపై సమాచారాన్ని సేకరించింది. మరి ఏవేమీ పోస్టులు ఖాళీగా ఉన్నాయో తెలుసుకోండి.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్ 2 పోస్టుల భర్తీ విషయంలో ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లోని ఖాళీల భర్తీపై దృష్టి సారించింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఏయే శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న సమాచారాన్ని సేకరించే పనిలో పడింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటి వరకూ గ్రూప్ 1 కింద 140 పోస్టులు, గ్రూప్ 2 కింద 1082 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మొత్తం 12 శాఖల పరిధిలో గ్రూప్ 1 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సంబంధిత అధికారులు గుర్తించారు. హెచ్వోడీతో పాటు మరో 10 శాఖల పరిధిలో గ్రూప్ 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు తేల్చారు. వీలైనంత త్వరగా ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
కాగా అత్యున్నత సర్వీసులైన గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. గతంలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ కంటే అధికంగా పోస్టులను భర్తీ చేయాలని ఇటీవల సీఎం జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే. గ్రూప్-1 లో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ, ఆర్టీవో, సీటీవో, మున్సిపల్ కమిషనర్లు, డీఎఫ్ఓ, ఎంపీడీవో వంటి పోస్టులు ఉండగా.. గ్రూప్-2లో డిప్యూటీ తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు, ట్రెజరీ పోస్టులు ఉన్నాయి.
— Hardin (@hardintessa143) April 19, 2023