అక్టోబర్ నెల మొత్తం ఉద్యోగ పర్వంలా, ఉద్యోగ మాసంలా ఉంది. ఇప్పటికే గ్రూప్ 1, ఫారెస్ట్ సర్వీస్, ఏపీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబ్ ఆర్డినేట్ సర్వీస్ వంటి వాటిలో పలు ఉద్యోగాలతో శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.. 21న పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో ఏపీ నిరుద్యోగ యువతకు సీఎం జగన్ దీపావళి కానుక ఇచ్చినట్టు అయ్యింది. తాజాగా డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో టైయప్ అయిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) జాబ్ మేళా నిర్వహిస్తోంది. ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీ సిటీలో ఈ నెల 24న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఈ జాబ్ మేళా ద్వారా ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
మొత్తం ఖాళీలు: 150
పోస్ట్: ట్రైనీ
@AP_Skill has Collaborated with #NS_InstrumentsIndiaPvtLtd to Conduct Industry Customized Skill Training & Placement Program @Sri_City #TirupatiDistrict
For more details on eligibility visit https://t.co/XnrotfY4b3
Contact: Mr S.Dinaker 8121585857
APSSDC Helpline: 99888 53335 pic.twitter.com/E37zj3Nli5— AP Skill Development (@AP_Skill) October 20, 2022