మీరు నిరుద్యోగులా..? ప్రభుత్వ నర్సింగ్ ఉద్యోగాల కోసం వేచిచూస్తున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల్లో 3,055 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థల్లో 3,055 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి గుర్తింపు పొందిన ఏదేని యూనివర్సిటీ నుంచి డిప్లొమా(జీఎన్‌ఎం)/ బీఎస్సీ నర్సింగ్/ బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్/ బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికేట్)/ పోస్ట్-బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే స్టేట్, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సులుగా రిజిస్టరై ఉండాలి. ఎలా దరఖాస్తు చేయాలి..? జీతభత్యాలు ఎలా ఉంటాయి..? వంటి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం ఖాళీలు: 3,055
ఖాళీల వివరాలు
విభాగాలు: నర్సింగ్ ఆఫీసర్
అర్హతలు: డిప్లొమా(జీఎన్‌ఎం) అర్హతతో పాటు రెండేళ్ల పని అనుభవం లేదా బీఎస్సీ నర్సింగ్/ బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్/ బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికేట్)/ పోస్ట్-బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు స్టేట్, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సులుగా రిజిస్టరై ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు 10 ఏళ్లు, ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు 5 ఏళ్ల మినహాయింపు ఉంటుంది.
జీతభత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.9,300 నుంచి రూ. 34,800 వేతనంగా చెల్లిస్తారు. దీంతో పాటు రూ.4,600 గ్రేడ్ పే అందుతుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ అభ్యర్థులు రూ.3,000, ఎస్‌సీ, ఎస్‌టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.2,400 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మినహాయింపు ఉంది.
ఎంపిక ప్రక్రియ: నార్‌సెట్-4 పరీక్షా ఫలితాలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నార్‌సెట్ పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. 200 ప్రశ్నలకు.. 200 మార్కులు కేటాయించారు. సబ్జెక్టుకు సంబంధించి 180 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ అండ్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి 10 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లీష్ కు సంబంధించి 10 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులు కోత విధిస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 12.04.2023
దరఖాస్తులకు చివరితేదీ: 05.05.2023
సీబీటీ పరీక్ష తేదీ: 06.06.2023